MLC Jeevan Reddy : ఉత్తమ్ పై జీవన్ రెడ్డి కామెంట్స్
పొన్నం ప్రభాకర్ వెళ్లే ఛాన్స్ లేదు
MLC Jeevan Reddy : కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు, ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. శుక్రవారం మీడియాతో మాట్లాడారు. మాజీ టీపీసీసీ చీఫ్ ఉత్తమ్ కుమార్ రెడ్డి పార్టీ మారతారని ప్రచారం జరుగుతోందన్నారు. కొక్కిరాల ప్రేమ్ సాగర్ రావు కూడా పార్టీని వీడీ అవకాశం ఉందన్నారు. కరీంనగర్ మాజీ ఎంపీ పొన్నం ప్రభాకర్ ఎట్టి పరిస్థితుల్లో పార్టీని వీడడంటూ స్పష్టం చేశారు. తనకు తెలియకుండా వెళ్లే ప్రసక్తి లేదన్నారు.
MLC Jeevan Reddy Comments
కాంగ్రెస్ పార్టీలో మంచి పట్టు కలిగిన నాయకుడిగా గుర్తింపు పొందారు జీవన్ రెడ్డి(MLC Jeevan Reddy). ఆయన గతంలో వైఎస్సార్ సర్కార్ లో కీలక పాత్ర పోషించారు. ప్రజలతో కలిసి ఉంటారనే పేరుంది. ప్రస్తుతం ఉత్తమ్ కుమార్ రెడ్డి, పొన్నం ప్రభాకర్ , ప్రేమ్ సాగర్ రావులపై చేసిన వ్యాఖ్యలు కలకలం రేపుతున్నాయి.
ఇప్పటికే కాంగ్రెస్ పార్టీలో రేవంత్ రెడ్డి అధ్యక్షుడిగా కొలువు తీరాక కీలక మార్పులు చోటు చేసుకున్నాయి. మొత్తంగా ఒకరిపై మరొకరు ఆరోపణలు చేసుకుంటూ వేడి రాజేశారు. త్వరలో ఎన్నికలు జరగనున్న తరుణంలో ఉత్తమ్ తో పాటు ఆయన భార్య కూడా పార్టీని వీడే అవకాశం ఉందంటూ ప్రచారం జరుగుతోంది. ఉత్తమ్ రాహుల్ గాంధీతో మంచి స్నేహం ఉంది. పాడి కౌషిక్ రెడ్డి బీఆర్ఎస్ లో చేరేందుకు ప్రధాన కారకుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి అన్న అపవాదు లేక పోలేదు.
Also Read : KTR : హరితహారానికి సర్కార్ సహకారం