MLC Jeevan Reddy : బీఆర్ఎస్ ఖేల్ ఖతం – జీవన్ రెడ్డి
వచ్చే ఎన్నికల్లో హస్తం..కమలం మధ్యే పోటీ
MLC Jeevan Reddy : కరీంనగర్ జిల్లా – కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి సంచలన కామెంట్స్ చేశారు. వచ్చే ఎన్నికల్లో కేవలం కాంగ్రెస్ ,బీజేపీ పార్టీల మధ్యనే అసలైన పోటీ ఉంటుందన్నారు. జీవన్ రెడ్డి మీడియాతో మాట్లాడారు. తెలంగాణలో భారత రాష్ట్ర సమితి పార్టీ పనై పోయిందని ఎద్దేవా చేశారు.
MLC Jeevan Reddy Comments on BRS
మాజీ మంత్రి కేటీఆర్ చేసిన కామెంట్స్ కు స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు. ఇప్పటికే రాష్ట్రాన్ని అప్పుల కుప్పగా మార్చేసింది చాలక , తమ సర్కార్ పై విమర్శలు ఎలా చేస్తారంటూ ప్రశ్నించారు .
ఇది ఎంత మాత్రం మంచి పద్దతి కాదన్నారు. త్వరలోనే శాఖల వారీగా శ్వేత పత్రం విడుదల చేస్తామని ప్రకటించారు. అప్పుడు తెలుస్తుంది బీఆర్ఎస్ మంత్రులు, ఎమ్మెల్యేలు, ఇతర ప్రజా ప్రతినిధులు చేసిన నిర్వాకం, దోచుకున్నది అని అన్నారు. ప్రతి ఒక్కరి చిట్టా బయటకు వస్తుందన్నారు జీవన్ రెడ్డి. అంత వరకు కాస్తా ఓపిక పట్టాలని కేటీఆర్ కు సూచించారు .
హుస్నాబాద్ ను తిరిగి కరీంనగర్ లో కలపాలనే డిమాండ్ నెరవేరే రోజు త్వరలోనే పూర్తి అవుతుందన్నారు జీవన్ రెడ్డి(MLC Jeevan Reddy). బీఆర్ఎస్ నేతల్లో ఇప్పటికే వణుకు ప్రారంభం అయ్యిందన్నారు. బీఆర్ఎస్, బీజేపీ రెండూ ఒక్కటేనని తేలి పోయిందన్నారు. వచ్చే పార్లమెంట్ ఎన్నికల్లో కాంగ్రెస్ 17 సీట్లను కైవసం చేసుకుంటుందన్నారు ఎమ్మెల్సీ.
Also Read : Priyanka Chaturvedi : భద్రతా లోపం ప్రియాంక ఆగ్రహం