MLC Jeevan Reddy : అప్పుల కుప్పగా మార్చిన కేసీఆర్
నిప్పులు చెరిగిన ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి
MLC Jeevan Reddy : హైదరాబాద్ – తెలంగాణ రాష్ట్రాన్ని అప్పుల కుప్పగా మార్చేశాడని సంచలన ఆరోపణలు చేశారు ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి. శుక్రవారం ఆయన మీడియాతో మాట్లాడారు. కాంగ్రెస్ పార్టీ ఏర్పాటుతో నిజమైన తెలంగాణ వచ్చిందన్నారు.
MLC Jeevan Reddy Comments on KCR
గత ప్రభుత్వ పాలన ఉమ్మడి రాష్ట్ర పాలన కంటే అధ్వాన్నంగా నిర్వహించారని ఆరోపించారు. దీంతో రాష్ట్రం అప్పుల ఖర్చు ఏకంగా రూ. 6,00,000 కోట్లు దాటిందన్నారు. లక్షా 20 వేల కోట్ల ప్రజా ధనంతో నిర్మించిన కాళేశ్వరం ప్రాజెక్టులో చోటు చేసుకున్న అవినీతి, అక్రమాలకు తెర లేపారని దీనిపై విచారణ చేపట్టాలని జీవన్ రెడ్డి డిమాండ్ చేశారు.
మేడిగడ్డ ప్రాజెక్టు నిర్మాణంలో లోపాలు ఉన్నట్లు కేంద్ర జలశక్తి చెప్పిందన్నారు. ఆ ప్రాజెక్టుకు అనుమతి కూడా లేదన్నారు. లక్షా 20 వేల కోట్లు ఆర్థిక భారం ప్రజలపై పడిందన్నారు. ఇది పూర్తిగా కేసీఆర్ వైఫల్యమేనని ఆవేదన వ్యక్తం చేశారు.
ఆ ప్రాజెక్టుకు సీడబ్ల్యూసీ అనుమతి కూడా లేదన్నారు జీవన్ రెడ్డి(Jeevan Reddy). పూర్తిగా న్యాయ విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు. వాస్తవాలు ఏమిటో ప్రజలకు తెలియాల్సిన అవసరం ఉందన్నారు. మహారాష్ట్రతో ఒప్పందం ఉన్నందు వల్ల తుమ్మడిపాటి వద్ద బ్యారేజ్ నిర్మించాలని పేర్కొన్నారు.
Also Read : Prabhakar Rao : ప్రభాకర్ రావు ఇంటికి సీఐడీ..?