MLC Kavitha : కాంగ్రెస్ వల్లనే రైతు బంధుకు బ్రేక్
నిప్పులు చెరిగిన ఎమ్మెల్సీ కవిత
MLC Kavitha : హైదరాబాద్ – కేంద్ర ఎన్నికల సంఘం సంచలన నిర్ణయం తీసుకుంది. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వానికి కోలుకోలేని షాక్ ఇచ్చింది. రైతు బంధు పథకం కింద లబ్దిదారులకు నిధులు విడుదల చేయొద్దంటూ స్పష్టం చేసింది. వెంటనే నిలిపి వేయాలని ఆదేశించింది. మంత్రి హరీశ్ రావు బాధ్యతాయుతమైన మంత్రి పదవిలో ఉంటూ ప్రజలను ప్రభావితం చేసేలా రైతు బంధును ఈనెల 28న వేస్తామంటూ ప్రకటించడాన్ని తీవ్రంగా పరిగణించింది ఈసీ. ఈ మేరకు ఈ నిర్ణయం తీసుకున్నట్లు స్పష్టం చేసింది. సోమవారం జారీ చేసిన ఆదేశాలలో కీలకమైన వ్యాఖ్యలు చేసింది.
MLC Kavitha Slams Congress
ఎన్నికల ప్రచారంలో రైతు బంధును ప్రత్యేకంగా ప్రస్తావించారని, దీనిని ప్రత్యేకంగా హైలెట్ చేస్తూ కాంగ్రెస్ పార్టీ నేతలు ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేశారంటూ బీఆర్ఎస్ ఆరోపించింది. ఇదిలా ఉండగా కేంద్ర ఎన్నికల సంఘం తీసుకున్న నిర్ణయంపై తీవ్రంగా స్పందించారు సీఎం కేసీఆర్ కూతురు, లిక్కర్ స్కాంలో తీవ్ర ఆరోపణలు ఎదుర్కొంటున్న ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత(MLC Kavitha).
రైతు బంధు ఆగి పోవడానికి ప్రధాన కారణం కాంగ్రెస్ పార్టీనేనంటూ సంచలన ఆరోపణలు చేశారు. రైతులకు సాయం చేయకుండా అడ్డుకోవడం ఎంత వరకు సబబు అంటూ ప్రశ్నించారు. రైతులకు మేలు చేయాలని తాము చూస్తే వారిని ఇబ్బందులకు గురి చేయడం భావ్యం కాదన్నారు కవిత.
Also Read : Harish Rao : హరీశ్ కామెంట్స్ ఈసీ సీరియస్