MLC Kavitha Release : ముగిసిన ఎమ్మెల్సీ కవిత విచారణ
తొమ్మిది గంటల పాటు ప్రశ్నల వర్షం
MLC Kavitha Release : ఢిల్లీ లిక్కర్ స్కాం కేసులో తీవ్ర ఆరోపణలు ఎదుర్కొంటున్న తెలంగాణ సీఎం కేసీఆర్ కూతురు ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత శనివారం కేంద్ర దర్యాప్తు సంస్థ ఈడీ ఆఫీసు ముందు విచారణకు హాజరైంది. ఉదయం 11 గంటలకు ఢిల్లీలోని సీఎం కేసీఆర్ భవన్ నుంచి భారీ భద్రత మధ్య ఈడీ కార్యాలయానికి చేరుకుంది. ముందు ఆమె తన వివరాలను నమోదు చేశారు.
అనంతరం ఎమ్మెల్సీ కవిత ను మాత్రమే లోపలికి అనుమతించింది ఈడీ. ఆమె వెంట భర్త అనిల్ తో పాటు అడ్వొకేట్ ను , సెక్యూరిటీని అనుమతించ లేదు. ఉదయం నుంచి ప్రారంభమైన ఎమ్మెల్సీ కవిత విచారణ 9 గంటల పాటు సాగింది.
ఈడీ ఆఫీసు నుంచి రాత్రి 8.05 నిమిషాలకు బయటకు వచ్చింది. స్కాంకు సంబంధించి మొత్తం కూపీ లాగినట్లు సమాచారం. సౌత్ గ్రూప్ , ఆడిటర్ బుచ్చిబాబు, పిళ్లై తదితరుల పాత్ర గురించి ఈడీ ఆరా తీసినట్లు టాక్. ఎమ్మెల్సీ కవిత విచారణ సందర్భంగా భారీ ఎత్తున ఢిల్లీకి చేరుకున్నారు బీఆర్ఎస్ మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎంపీలు, ప్రజా ప్రతినిధులు, నాయకులు, శ్రేణులు, భారత జాగృతి సంస్థ ప్రతినిధులు . విచారణ సందర్భంగా ఢిల్లీ పోలీసులు భారీ భద్రత ఏర్పాటు చేశారు.
ఆందోళనలు, ధర్నాలు, నిరసనలు చేపడితే తీవ్ర చర్యలు ఉంటాయని ముందస్తుగా హెచ్చరించారు. ఈడీ ఆఫీసు ప్రాంగణం చుట్టు పక్కల ఎవరూ ఉండ కూడదని ఆదేశాలు జారీ చేసింది. ఇదే సమయంలో ఎమ్మెల్సీ కవిత(MLC Kavitha Release) ఈడీ ఆఫీసులోకి వెళ్లే ముందు పిడికిలి బిగించారు. బయటకు వచ్చిన సమయంలోనూ కవిత నవ్వుకుంటూ వెళ్లి పోయారు. మొత్తంగా మరోసారి మార్చి 16న విచారణకు రావాలంటూ ఆదేశించినట్లు సమాచారం.
Also Read : రావమ్మా ఎమ్మెల్సీ కవితమ్మా