MLC Kavitha Security : ఢిల్లీలో టెన్షన్ టెన్షన్
కొనసాగుతున్న కవిత విచారణ
MLC Kavitha Security : ఢిల్లీ లిక్కర్ స్కాంకు సంబంధించి తీవ్ర ఆరోపణలు ఎదుర్కొంటున్న తెలంగాణ సీఎం కేసీఆర్ కూతురు ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత(MLC Kavitha) సోమవారం ఈడీ ముందు విచారణకు వెళ్లారు. ఆమె ఇంకా బయటకు రాలేదు. ఉదయం 10.30 గంటల నుండి సాయంత్రం వరకు ఈడీ వద్దనే ఉన్నారు. ప్రస్తుతం డాక్టర్ల బృందం వెళ్లడంతో టెన్షన్ నెలకొంది.
అడిషనల్ అడ్వొకేట్ జనరల్ రామచంద్ర రావు కూడా వెళ్లడం అనుమానాలకు తావిస్తోంది. అయితే వైద్య బృందం ఎందుకు వెళ్లిందనే దానిపై భారత రాష్ట్ర సమితి శ్రేణులలో ఆందోళన నెలకొంది. న్యాయవాదులు లోపలికి వెళ్లడం ఆసక్తిని రేపుతోంది. రాత్రి అవుతున్నా కవిత బయటకు రాలేదు. ఎలాంటి ఆందోళన చెందాల్సిన అవసరం లేదని ఆమె తరపు న్యాయవాది సామ భరత్ వెల్లడించారు.
ఇదిలా ఉండగా ఢిల్లీ లిక్కర్ స్కాం దేశ వ్యాప్తంగా కలకలం రేపింది. ఇప్పటి వరకు ఈ కేసుకు సంబంధించి సీబీఐ 34 మందిపై అభియోగం మోపింది. 11 మందిని అరెస్ట్ చేసింది. వారిలో ఆప్ అగ్ర నేత , ఢిల్లీ డిప్యూటీ సీఎం మనీష్ సిసోడియాతో పాటు అరుణ్ రామచంద్రన్ పిళ్లై కస్టడీలో ఉన్నారు.
ఇదిలా ఉండగా ముందు జాగ్రత్తగా ఢిల్లీ ఈడీ ఆఫీసు ముందు భారీ ఎత్తున పోలీసులు మోహరించారు(MLC Kavitha Security). ఇప్పటికే మార్చి 11న 9 గంటల పాటు విచారణ చేపట్టింది. ఈనెల 16న హాజరు కావాలని సమన్లు ఇచ్చింది. దీనిపై తాను రాలేనంటూ పేర్కొంది కవిత. మార్చి 20న హాజరు కావాల్సిందేనంటూ ఈడీ స్పష్టం చేసింది.
Also Read : టీపీసీసీ చీఫ్ కు సిట్ బిగ్ షాక్