MLC Kavitha : హైదరాబాద్ – ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితకు అరుదైన గౌరవం దక్కింది. తెలంగాణ ఉద్యమ సమయంలో బతుకమ్మకు భారీ ఎత్తున ప్రచారం తీసుకు రావడంలో కీలక పాత్ర పోషించారు కవిత. ఇదే సమయంలో ఆమె జాగృతి సంస్థ పేరుతో స్వచ్చంధ సంస్థను ఏర్పాటు చేశారు. దేశ, విదేశాలలో సదరు సంస్థ బతుకమ్మను ప్రజల్లోకి తీసుకు పోవడంలో సక్సెస్ అయ్యారు.
MLC Kavitha Got Appreciations
తెలంగాణ ఏర్పాటు అయిన తర్వాత జాగృతి సంస్థ కన్వీనర్ గా ఉన్న కవితకు బీఆర్ఎస్ బాస్, సీఎం కేసీఆర్ నిజామాబాద్ ఎంపీగా ఛాన్స్ ఇచ్చారు. అక్కడ గెలుపొందారు. మహిళా వాయిస్ ను పార్లమెంట్ లో వినిపించే ప్రయత్నం చేశారు.
అనంతరం గతంలో జరిగిన ఎన్నికల్లో బీజేపీ అభ్యర్థి ధర్మపురి అర్వింద్ చేతిలో ఊహించని రీతిలో ఓటమి పాలయ్యారు. ఆ తర్వాత కొంత గ్యాప్ తీసుకుంది. బీఆర్ఎస్ లో కీలక నాయకురాలిగా చక్రం తిప్పిన కవితకు ఊహించని షాక్ తగిలింది. ఈ తరుణంలో లిక్కర్ స్కాం బయటకు వచ్చింది. మూడుసార్లు కేంద్ర దర్యాప్తు సంస్థ వద్దకు హాజరయ్యారు.
ఇదే సమయంలో ఎమ్మెల్సీగా అవకాశం ఇచ్చారు కవితకు(MLC Kavitha) సీఎం కేసీఆర్. ప్రస్తుతం ఆక్స్ ఫర్డ్ యూనివర్శిటీ నుంచి కవితకు ప్రసంగించే ఛాన్స్ ఇచ్చింది. ఈ మేరకు ఆహ్వానం పంపింది.
Also Read : Harish Rao : రేవంత్ తెలంగాణ ద్రోహి