MLC Kavitha : గీత దాటిన గ‌వ‌ర్న‌ర్ – క‌విత

ఇది బీజేపీ రాజ్యాంగ‌మా

MLC Kavitha : హైద‌రాబాద్ – ఎమ్మెల్సీ క‌ల్వ‌కుంట్ల క‌విత తీవ్ర ఆగ్ర‌హం వ్య‌క్తం చేశారు. ఆమె కేంద్ర స‌ర్కార్ పై నిప్పులు చెరిగారు. మంగ‌ళ‌వారం ఆమె త‌మ ప్ర‌భుత్వం సిఫార‌సు చేసిన ఎమ్మెల్సీల ఫైల్ ను గ‌వ‌ర్న‌ర్ త‌మిళి సై సౌంద‌ర రాజ‌న్ తిప్పి పంప‌డాన్ని తీవ్రంగా ప్ర‌శ్నించారు. ఇది ఏ ర‌క‌మైన రాజ్యాంగ‌మ‌ని నిల‌దీశారు. ఇది ఎంత మాత్రం మంచి ప‌ద్ద‌తి కాద‌న్నారు.

MLC Kavitha Serious on MLC File Rejection

దేశంలో కాషాయ రాజ్యాంగం న‌డుస్తోంద‌ని డాక్ట‌ర్ బాబా సాహెబ్ అంబేద్క‌ర్ రాసిన రాజ్యాంగం న‌డవ‌డం లేద‌ని సంచ‌ల‌న ఆరోప‌ణ‌లు చేశారు. అన్ని చూసుకునే త‌మ స‌ర్కార్ వారిని ప్ర‌మోట్ చేసింద‌న్నారు క‌విత‌(MLC Kavitha). కానీ ప‌నిగ‌ట్టుకుని క‌క్ష సాధింపు తో ఫైల్ ను తిప్పి పంపారంటూ ఆరోపించారు.

ఇది ముమ్మాటికీ రాజ్యాంగ ఉల్లంఘ‌నేన‌ని పేర్కొన్నారు. రాజ్యాంగ అధికారాల ప‌రిమితుల గురించి ప్ర‌శ్నించే విధంగా గ‌వ‌ర్న‌ర్లు వ్య‌వ‌హ‌రించ‌డం దారుణ‌మ‌ని ఆవేద‌న చెందారు. తెలంగాణ శాస‌న‌స‌భ హాలులో ఏర్పాటు చేసిన చాక‌లి ఐల‌మ్మ జ‌యంతి వేడుక‌ల్లో క‌ల్వ‌కుంట్ల క‌విత పాల్గొన్నారు.

రాష్ట్ర ప్ర‌భుత్వాలు పంపిన అభ్య‌ర్థుల జాబితాల‌ను గ‌వ‌ర్న‌ర్లు ఆమోదించ‌డం ఆన‌వాయితీగా వ‌స్తోంద‌న్నారు . వెనుక‌బ‌డిన వ‌ర్గాల‌కు త‌మ పార్టీ, ప్ర‌భుత్వం ఎంత‌గానో కృషి చేస్తోంద‌న్నారు క‌విత‌.

Also Read : Bengaluru Bandh : బెంగ‌ళూరు బంద్ ఉద్రిక్తం

Leave A Reply

Your Email Id will not be published!