MLC Kavitha : కోమటిరెడ్డి ఆరోగ్యంపై కవిత ఆరా
ఆస్పత్రిని సందర్శించిన ఎమ్మెల్సీ
MLC Kavitha : హైదరాబాద్ – ఢిల్లీ పర్యటన ముగించుకుని వచ్చిన వెంటనే తీవ్ర అనారోగ్యానికి గురయ్యారు రాష్ట్ర రోడ్లు, భవనాల శాఖ మంత్రి కోమటి రెడ్డి వెంకట్ రెడ్డి. దీంతో హుటా హుటిన యశోద ఆస్పత్రిలో చేరారు. విషయం తెలుసుకున్న కేంద్ర మాజీ మంత్రి, సీనియర్ నాయకురాలు రేణుకా చౌదరి పరామర్శించారు.
MLC Kavitha Met Komatireddy Venkat Reddy
ఇదే సమయంలో విషయం తెలుసుకున్న మాజీ సీఎం కేసీఆర్ తనయురాలు ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత కోమటిరెడ్డి వెంకట్ రెడ్డిని కలుసుకుని పరామర్శించారు. ఆరోగ్యం ఎలా ఉందంటూ ఆరా తీశారు. ఈ సందర్భంగా ఆస్పత్రి వైద్యులను అడిగి తెలుసుకున్నారు కవిత(MLC Kavitha). మంత్రి త్వరగా కోలుకోవాలని కోరారు.
అంతకు ముందు భువనగిరి ఎంపీగా ఉన్నారు. తాను తాజాగా జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో ఎమ్మెల్యేగా గెలుపొందారు. ప్రస్తుతం రోడ్లు, భవనాల, సినిమాటోగ్రఫీ మంత్రిగా కొలువు తీరారు. గురువారం శాసన సభలో కొత్తగా కొలువు తీరిన స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ కు శుభాభినందనలు తెలిపారు.
పార్లమెంట్ లో లోక్ సభ స్పీకర్ ఓం బిర్లాను కలుసుకున్నారు మంత్రి కోమటి రెడ్డి వెంకట్ రెడ్డి. ఈ సందర్భంగా భువనగిరి ఎంపీ పదవికి రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించారు. తన రాజీనామా పత్రాన్ని స్పీకర్ కు అందజేశారు. సభాపతిని శాలువాతో సన్మానించారు కోమటి రెడ్డి వెంకట్ రెడ్డి.
Also Read : Gaddam Prasad Kumar : గడ్డం ప్రసాద్ స్పీకర్ గా ఎన్నిక