MLC Kavitha : ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత సంచలన వ్యాఖ్యలు చేశారు. శుక్రవారం ఆమె మీడియాతో మాట్లాడారు. రాబోయే శాసనసభ ఎన్నికల్లో 119 సీట్లకు గాను 100 సీట్లకు పైగా గెలుస్తామని ధీమా వ్యక్తం చేశారు. ప్రతిపక్షాలకు అంత సీన్ లేదన్నారు.
దేశంలో ఎక్కడా లేని రీతిలో తెలంగాణ రాష్ట్రంలో సంక్షేమ పథకాలు, కార్యక్రమాలు అమలు చేస్తున్నామని చెప్పారు. ఇవాళ అభివృద్దికి నమూనాగా మనం ఉన్నామని చెప్పారు. కొందరు చేస్తున్న ఆరోపణలలో వాస్తవం లేదన్నారు కల్వకుంట్ల కవిత.
MLC Kavitha Comments Viral
మాయ మాటలు చెప్పే వారిని నమ్మవద్దని కోరారు. బరా బర్ గిరి గీసి చెబుతున్నానని మనదే విజయమని జోష్యం చెప్పారు. ముచ్చటగా మూడోసారి గులాబీ జెండా తెలంగాణలో ఎగురుతుందన్నారు. సీఎంగా కేసీఆర్ హ్యాట్రిక్ కొట్టేందుకు రెడీగా ఉన్నారని అన్నారు కవిత(MLC Kavitha).
ప్రతిపక్షాల అభ్యర్థులకు చివరకు డిపాజిట్లు కూడా దక్కవన్నారు. వారికి ఇప్పటి వరకు అభ్యర్థులు దొరకడం లేదన్నారు. ఆమె పరోక్షంగా కాంగ్రెస్, బీజేపీ పార్టీలను ఉద్దేశించి ఎద్దేవా చేశారు .
ఇప్పటి వరకు ఏ పార్టీ కూడా తమ దరిదాపుల్లోకి రాలేదన్నారు. 119 సీట్లకు గాను 115 సీట్లను ప్రకటించిన ఏకైక సీఎం మన కేసీఆర్ అన్నారు. ఎంత ధైర్యం ఉండాలి..ముందే ప్రకటించేందుకని పేర్కొన్నారు ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత.
ప్రతిపక్షాల ఆటలు కేసీఆర్ ముందు సాగవన్నారు. ఆల్ రెడీ మేం విజయంలోనే ఉన్నామని స్పష్టం చేశారు.
Also Read : Bandi Sanjay : సగం మందికి కేసీఆర్ సీట్లు ఇవ్వడు