MLC Kavitha : బీఆర్ఎస్ హ్యాట్రిక్ పక్కా – కవిత
ఓటు వేసిన ఎమ్మెల్సీ కల్వకుంట్ల
MLC Kavitha : హైదరాబాద్ – లిక్కర్ స్కాంలో తీవ్ర ఆరోపణలు ఎదుర్కొంటున్న ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత గురువారం ఓటు హక్కు వినియోగించుకున్నారు. అనంతరం ఆమె మీడియాతో మాట్లాడారు. రాష్ట్ర వ్యాప్తంగా గులాబీ గాలి వీస్తోందని అన్నారు. ఇందులో ఎలాంటి అనుమానం అక్కర్లేదన్నారు.
MLC Kavitha Comment
119 నియోజకవర్గాలలో 80కి పైగా సీట్లు పక్కాగా బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు గెలుస్తారని స్పష్టం చేశారు. కాంగ్రెస్ పార్టీ బలుపు చూసుకుని వాపు అనుకుంటోందన్నారు కల్వకుంట్ల కవిత(MLC Kavitha). దేశంలో ఎక్కడా లేని రీతిలో సంక్షేమ పథకాలు అమలు చేసిన ఘనత కేసీఆర్ కే దక్కుతుందన్నారు.
ముచ్చటగా మూడోసారి బీఆర్ఎస్ అధికారంలోకి రావడం ఖాయమన్నారు. ఇవాళ తెలంగాణ అమలు చేస్తోందని యావత్ దేశం ఆచరిస్తోందన్నారు ఎమ్మెల్సీ. ప్రతి ఒక్కరు తమ విలువైన ఓటు వినియోగించు కోవాలని పిలుపునిచ్చారు.
జనం పూర్తిగా గులాబీ పార్టీ ద్వారానే తమకు న్యాయం జరుగుతుందని నమ్ముతున్నారని, అందుకే తమకు గంప గుత్తగా ఓటు వేశారని అన్నారు. తాము మూడోసారి ప్రమాణ స్వీకారం చేసేందుకు అన్ని ఏర్పాట్లు చేయడం జరుగుతోందన్నారు. ప్రజలు స్పష్టమైన తీర్పు ఇవ్వడం తప్పదన్నారు.
Also Read : Minister KTR : గులాబి గాలి వీస్తోంది – కేటీఆర్