MLC Kavitha : బరిలోకి దిగుతా బరాబర్ ఓడిస్తా
ఎమ్మెల్యే కల్వకుంట్ల కవిత శపథం
MLC Kavitha : ఢిల్లీ లిక్కర్ స్కాం లో తీవ్ర ఆరోపణలు ఎదుర్కొని, కేంద్ర దర్యాప్తు సంస్థల విచారణ ఎదుర్కొన్న సీఎం కేసీఆర్ కూతురు ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత సంచలన వ్యాఖ్యలు చేశారు. వచ్చే ఎన్నికల్లో నిజామాబాద్ నుంచి పోటీ చేస్తానని ప్రకటించారు. అక్కడి నుంచి బరిలోకి దిగుతా, బరా బర్ బీజేపీ, కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులను అడ్రస్ లేకుండా చేస్తా..వారిని ఇంటికి పంపిస్తానంటూ స్పష్టం చేశారు.
MLC Kavitha Comments on Coming Election
ఆమె ధర్మపురి అర్వింద్ చేతిలో ఓటమి పాలయ్యారు. ఆ తర్వాత కొంత కాలం పాటు దూరంగా ఉన్నారు. ఆ వెంటనే ఎమ్మెల్సీ కోటాలో తండ్రి సీటు ఇచ్చారు. వెంటనే శాసన మండలి సభ్యురాలిగా ఎన్నికయ్యారు. ఇదే సమయంలో ఢిల్లీ లిక్కర్ స్కాం దేశ వ్యాప్తంగా సంచలనం కలిగించింది. ఆమె పాత్ర ఉందంటూ మొదట దర్యాప్తు ఏజెన్సీలు కోడై కూశాయి. చివరకు అవి కూడా కిమ్మనకుండా ఉండి పోయాయి.
మహిళను ఎలా విచారిస్తారంటూ ప్రశ్నించింది. చివరకు సుప్రీంకోర్టు న్యాయస్థానం తలుపు తట్టింది. లిక్కర్ స్కాం కేసులో ఇప్పటికే పలువురిని అదుపులోకి తీసుకుంది. అందరూ ఇదిగో అదిగో కవిత(MLC Kavitha) అరెస్ట్ అంటూ ప్రచారం చేశారు. కానీ చివరకు కవిత డేర్ గా బయటకు వచ్చారు. తనకు సంబంధం లేదని స్పష్టం చేశారు.
Also Read : Pawan Kalyan Jagan : ఆంధ్రా వీరప్పన్ జగన్ – పవన్