MLC Kavitha : తమిళి సై కామెంట్స్ కవిత సీరియస్
గవర్నర్ ప్రసంగంపై తీవ్ర అభ్యంతరం
MLC Kavitha : హైదరాబాద్ – తెలంగాణ రాష్ట్ర గవర్నర్ ఫక్తు కాంగ్రెస్ నాయకురాలిగా మాట్లాడారని, ఆమె ఉన్నత పదవిలో ఉండి ఇలాగేనా ప్రసంగించడం అంటూ తీవ్ర స్థాయిలో మండిపడ్డారు ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత.
MLC Kavitha Slams Governer
పలు అంశాలు పూర్తిగా అభ్యంతరకరంగా ఉన్నాయని పేర్కొన్నారు. ధన్యవాద తీర్మానం సందర్భంగా శాసన మండలిలో ఆమె ప్రసంగించారు. ఇది పూర్తిగా అప్రజాస్వామికమని పేర్కొన్నారు. పదే పదే తమను వ్యక్తిగతంగా టార్గెట్ చేయడం ఎంత వరకు సబబు అని ప్రశ్నించారు.
ప్రజలు ఇచ్చిన తీర్పును తాము స్వాగతిస్తున్నామని స్పష్టం చేశారు. ఇందులో తాము వెనక్కి వెళ్లడం లేదన్నారు. ప్రస్తుత సర్కార్ కేవలం అప్పులను మాత్రమే ముందుకు తెస్తోందని, కానీ ఆస్తులను ఎలా పెంచామనే దానిపై క్లారిటీ ఇవ్వడం లేదన్నారు కవిత(MLC Kavitha).
గవర్నర్ ప్రసంగం పూర్తిగా తప్పుల తడకగా ఉందని, వాటిలో అబద్దాలు తప్ప ఒక్క నిజం కూడా లేదంటూ ఎద్దేవా చేశారు. రాబోయే రోజుల్లో ఎవరు ఏమిటో అనేది తేలుతుందన్నారు. తాము నిర్మాణాత్మకమైన ప్రతిపక్ష పాత్ర పోషిస్తామని స్పష్టం చేశారు కల్వకుంట్ల కవిత.
అభ్యంతరకరమైన పదాలను శాసన మండలి నుంచి తొలగించాలని తాను స్పీకర్ గుత్తా సుఖేందర్ రెడ్డిని కోరడం జరిగిందని తెలిపారు. ఇకనైనా సీఎంతో పాటు మంత్రివర్గం కొంచెం జాగ్రత్తతో మాట్లాడితే బావుంటుందని సూచించారు కవిత.
Also Read : Konda Surekha : బాధిత కుటుంబాలకు ఎక్స్‌గ్రేషియా