MLC Kavitha : మోదీ పాలనలో మహిళలకు ఇక్కట్లు
నిప్పులు చెరిగిన కల్వకుంట్ల కవిత
MLC Kavitha : ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత నిప్పులు చెరిగారు. ఆమె కేంద్ర సర్కార్ పై ఆగ్రహం వ్యక్తం చేశారు. మంగళవారం ట్విట్టర్ వేదికగా పలు ప్రశ్నలు సంధించారు. నూతన పార్లమెంట్ భవనం సందర్బంగా ఎందుకని ప్రథమ పౌరురాలు అయిన రాష్ట్రపతి ద్రౌపది ముర్మును ఆహ్వానించ లేదని ప్రశ్నించారు కల్వకుంట్ల కవిత(MLC Kavitha).
దేశ రాజధాని ఢిల్లీలో జంతర్ మంతర్ వేదికగా గత కొన్ని రోజులుగా భారత రెజ్లర్ల సమాఖ్య చీఫ్, భారతీయ జనతా పార్టీ ఎంపీ బ్రిజ్ భూషణ్ శరణ్ సింగ్ కు వ్యతిరేకంగా ఆందోళన చేపట్టినా ఎందుకని చర్యలు తీసుకోలేదని నిలదీశారు ఎమ్మెల్సీ. రాత్రింబవళ్లు ధర్నా చేస్తున్నా తప్పు చేసిన ఎంపీపై ఇప్పటి వరకు ఎందుకు అరెస్ట్ చేయడం లేదని మండిపడ్డారు.
రాజధాని నడి వీధుల్లో ఆడ బిడ్డలను రోడ్డు మీద ఈడ్చుకుంటూ వెళితే మీరు ఏం చేస్తున్నారంటూ నిప్పులు చెరిగారు. భేటీ బచావో భేటీ పడావో అన్నది కేవలం నినాదాలకే పరిమితమైందని ఫైర్ అయ్యారు. బిల్కిస్ బానోపై అత్యాచారానికి పాల్పడిన వారిని ఎందుకు విడుదల చేశారో దేశానికి చెప్పాలని కల్వకుంట్ల కవిత డిమాండ్ చేశారు. సిలిండర్ ధరలు పెంచి మహిళలకు వంట గదుల్లో కన్నీళ్లు తెప్పిస్తున్న చరిత్ర మీకే దక్కుతుందన్నారు.
Also Read : AP CM YS Jagan : ఉద్యోగులు ప్రభుత్వ కుటుంబ సభ్యులు
