MLC Kavitha : ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత మాటల డోసు పెంచారు. ఆ మధ్య ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో ప్రత్యేకంగా పేరు ప్రస్తావనకు రావడంతో కొంత వెనక్కి తగ్గినా తర్వాత మాటల తూటాలు పేల్చుతున్నారు. తనదైన శైలిలో ముందుకు వెళుతున్నారు. ప్రధానంగా కల్వకుంట్ల కవిత(MLC Kavitha) ప్రతిపక్ష పార్టీలను టార్గెట్ చేస్తున్నారు. తాజాగా నిజామాబాద్ లో రాష్ట్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో ఐటీ హబ్ ను ఏర్పాటు చేసింది. దీనిని తన సోదరుడు, ప్రస్తుత కేబినెట్ లో కీలక మంత్రిగా ఉన్న కల్వకుంట్ల తారక రామారావు ప్రారంభించారు.
MLC Kavitha Slams Other Party MP’s
ఈ ఐటీ హబ్ ద్వారా వేలాది మందికి ఉపాధి అవకాశాలు లభిస్తాయని కవిత చెప్పారు. కానీ దానిని కూడా అర్థం చేసుకోకుండా ప్రతిపక్షాలు విమర్శలకు దిగడం దారుణమన్నారు. ఇది ఎంత మాత్రం మంచి పద్దతి కాదన్నారు. ఇలాగైతే ఏ కంపెనీ కూడా రాష్ట్రంలో పెట్టుబడి పెట్టదన్నారు.
ఒకప్పుడు ఐటీ అంటే బెంగళూరు అని చెప్పే వారని కానీ ఇవాళ సీన్ మారిందన్నారు కల్వకుంట్ల కవిత. ప్రస్తుతం దిగ్గజ కంపెనీలన్నీ హైదరాబాద్ బాట పట్టాయన్నారు. ఇవాళ లక్షా 80 వేల మందికి పైగా హైదరాబాద్ లోని ఐటీ కంపెనీలలో పని చేస్తున్నారని ఇది తమ సర్కార్ సాధించిన విజయం అని ఆమె పేర్కొన్నారు.
Also Read : KTR Bandi Sanjay : బండి భాషపై భగ్గుమన్న కేటీఆర్