MLC Kavitha : రేవంత్ రెడ్డిపై కవిత గుస్సా
ఆత్మగౌరవాన్ని తాకట్టు పెడితే ఎలా
MLC Kavitha : బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత నిప్పులు చెరగారు. శనివారం ట్విట్టర్ వేదికగా స్పందించారు. ఆమె తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ పార్టీ చీఫ్ ఎనుముల రేవంత్ రెడ్డిపై సంచలన ఆరోపణలు చేశారు. ఒకప్పుడు కాంగ్రెస్ పార్టీ తెలంగాణ రాజకీయం ఢిల్లీలో ఉండేదని కానీ ఇప్పుడు సీన్ మారిందని పేర్కొన్నారు. టీపీసీసీ చీఫ్ నుంచి ఇతర ముఖ్య నేతలంతా కర్ణాటక బాట పట్టారని పేర్కొన్నారు కల్వకుంట్ల కవిత.
MLC Kavitha Comments on Revanth Reddy
కాంగ్రెస్ పార్టీ అంటేనే తెలంగాణ ఆత్మ గౌరవాన్ని తాకట్టు పెట్టడం తప్ప మరొకటి కాదని పేర్కొన్నారు. ఢిల్లీ గల్లీలలో మోకరిల్లడం తప్పితే ఏం చేశారంటూ ప్రశ్నించారు కల్వకుంట్ల కవిత(MLC Kavitha). వ్యక్తిగత విమర్శలు చేయడం తప్పితే ఏమైనా చేసింది రాష్ట్రానికి ఉందా అని నిలదీశారు.
రాబోయే రోజుల్లో గెలుస్తామని కాంగ్రెస్ పార్టీ కలలు కంటోందని , ఆ పార్టీకి అంత సీన్ లేదన్నారు. జనం మొత్తం సీఎం కేసీఆర్ కావాలని కోరుకుంటున్నారని, ఇచ్చిన హామీలను నెరవేర్చడం జరిగిందన్నారు కల్వకుంట్ల కవిత. ప్రజలు గంప గుత్తగా బీఆర్ఎస్ ను గెలిపించాలని డిసైడ్ అయ్యారని స్పష్టం చేశారు .
119 సీట్లకు గాను 100 సీట్లకు పైగా బీఆర్ఎస్ గెలుచుకుని తీరుతుందని శపథం చేశారు కల్వకుంట్ల కవిత. ప్రస్తుతం టీపీసీసీ చీఫ్ కర్ణాటక డిప్యూటీ సీఎం డీకే శివ కుమార్ తో చర్చలు జరపడం తప్ప చేసింది ఏమీ లేదంటూ సెటైర్ వేశారు కల్వకుంట్ల కవిత.
Also Read : YS Jagan Tour : జగన్ లండన్ పర్యటనకు ఓకే
