MLC Kavitha : క‌విత యూట‌ర్న్ నేను ఫుల్ బిజీ

సీబీఐకి లేఖ రాసిన ఎమ్మెల్సీ

MLC Kavitha : ఢిల్లీ లిక్క‌ర్ స్కాంకు సంబంధించి పెద్ద ఎత్తున ఆరోప‌ణ‌లు ఎదుర్కొంటున్న సీఎం కేసీఆర్ కూతురు ఎమ్మెల్సీ క‌ల్వ‌కుంట్ల క‌విత యూట‌ర్న్ తీసుకుంది. నేను చాలా బిజీగా ఉన్నాన‌ని, త‌న‌కు చాలా బాధ్య‌త‌లు ఉన్నాయ‌ని , తెలంగాణ జాగృతి సంస్థ అధ్య‌క్షురాలిగా, పార్టీలో కీల‌క‌మైన నాయ‌కురాలిగా, సీఎం కూతురుగా ఫుల్ బిజీగా ఉన్నాన‌ని స్పష్టం చేశారు.ఈ మేర‌కు కేంద్ర ద‌ర్యాప్తు సంస్థ సీబీఐకి లేఖ రాశారు. అస‌లు ఎఫ్ఐఆర్ లో త‌న పేరు లేద‌ని తాను ఎందుకు హాజ‌రు కావాల‌ని ప్ర‌శ్నించారు.

ఇదంతా కేవ‌లం కేంద్రంలోని బీజేపీ స‌ర్కార్ ఆడుతున్న నాట‌కంగా ఆరోపించారు. ఇదిలా ఉండ‌గా ఢిల్లీ లిక్క‌ర్ స్కాంలో సీబీఐ క‌విత(MLC Kavitha) పేరును ప్ర‌త్యేకంగా ప్ర‌స్తావించింది. ఆమె 11 ఫోన్లు వాడింద‌ని , 10 ఫోన్ల‌ను ధ్వ‌సంం చేసింద‌ని ఆరోపించింది. ఆధారాలు లేకుండా చేయ‌డంలో కీల‌క పాత్ర క‌విత పోషించింద‌ని పేర్కొంది. అంతే కాకుండా సౌత్ గ్రూప్ గా ఏర్ప‌డి అమిత్ అరోరా ద్వారా రూ. 100 కోట్లు ముడుపులు చెల్లింద‌ని ఆరోపించింది.

ఢిల్లీ లిక్క‌ర్ స్కాంలో మొత్తం 36 మందిని చేర్చింది. వారిలో ప్ర‌ధానంగా ఎమ్మెల్సీ క‌విత(MLC Kavitha) పేరు రావ‌డం క‌ల‌కం రేపింది. అయితే విచార‌ణ‌కు హాజ‌ర‌వుతారా లేక తామే రావాలా అని సీబీఐ జారీ చేసిన నోటీసులో పేర్కొంది. ఇందుకు సంబంధించి ఇవాళ తేదీ కూడా ఖ‌రారు చేసింది. దీంతో త‌న అరెస్ట్ త‌ప్ప‌ద‌ని భావించిన క‌విత తండ్రి కేసీఆర్ వ‌ద్ద‌కు మూడు సార్లు వెళ్లింది. చ‌ర్చోప‌చ‌ర్చ‌లు చేసింది. న్యాయ నిపుణుల‌ను క‌లిసింది. చివ‌ర‌కు ఎలా త‌ప్పించు కోవాల‌నే దానిపై ఫోక‌స్ పెట్టింది క‌విత‌.

Also Read : అంతా నాట‌కం అరెస్ట్ ఖాయం – బండి

Leave A Reply

Your Email Id will not be published!