Varudu Kalyani : మహిళా ద్రోహి చంద్రబాబు – కళ్యాణి
మహా శక్తి కాదు అది మాయా శక్తి
Varudu Kalyani : వైసీపీ ఎమ్మెల్సీ వరుదు కళ్యాణి నిప్పులు చెరిగారు. టీడీపీ చీఫ్ నారా చంద్రబాబు నాయుడితో పాటు పవన్ కళ్యాణ్ ను ఏకి పారేశారు. శనివారం ఆమె మీడియాతో మాట్లాడారు. టీడీపీ మేనిఫెస్టో అరిగి పోయిన పాత రికార్డు లాంటిదన్నారు. మహిళా ద్రోహి చంద్రబాబు అంటూ మండిపడ్డారు. మహిళల పట్ల సంస్కారం, సభ్యత లేకుండా మాట్లాడుతున్న బాబు, పవన్ కు ప్రజలు తగిన రీతిలో బుద్ది చెప్పడం ఖాయమన్నారు. మామ ఎన్టీఆర్ ను వెన్ను పోటు పొడిచిన బాబు విశ్వాసాన్ని కోల్పోయాడని అన్నారు. ప్రపంచ సైకోల సంఘానికి టీడీపీ చీఫ్ అధ్యక్షుడంటూ ఎద్దేవా చేశారు.
ఏ వాలంటీర్ వచ్చి మీ కుటుంబంలో గొడవలు సృష్టించారో చెప్పాలని వరుదు కళ్యాణి(Varudu Kalyani) డిమాండ్ చేశారు.
గత నాలుగేళ్లలో ఏ రాష్ట్రంలో లేని విధంగా సంక్షేమ పథకాలను అమలు చేస్తున్న ఘనత వైఎస్ జగన్ రెడ్డిదని పేర్కొన్నారు. అన్ని సర్వే సంస్థలు గంప గుత్తగా వైసీపీ పవర్ లోకి వస్తుందని ఇప్పటికే ప్రకటించాయని చెప్పారు. అయినా ఆధారాలు లేకుండా ఆరోపణలు చేయడం అలవాటుగా మారిందంటూ మండిపడ్డారు.
ఇవాళ జగన్ సర్కార్ తీసుకు వచ్చిన వాలంటీర్ వ్యవస్థ దేశానికే ఆదర్శ ప్రాయంగా నిలిచిందన్నారు. మహిళల్లో , ప్రజల్లో వస్తున్న ఆదరణను చూసి తట్టుకోలేక చంద్రబాబు, పవన్ అవాకులు, చెవాకులు పేలుతున్నారంటూ ఆరోపించారు వరుదు కళ్యాణి.
Also Read : Anudeep Durishetty KCR : పిన్న వయసులో నగరానికి కలెక్టర్