Amit Shah : త్వ‌ర‌లో మోడ‌ల్ జైళ్ల చ‌ట్టం – అమిత్ షా

రాష్ట్ర ప్ర‌భుత్వాలు ఆమోదించాలి

Amit Shah : కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ చంద్ర షా ఆస‌క్తిక‌ర వ్యాఖ్య‌లు చేశారు. త్వ‌ర‌లో మోడ‌ల్ జైళ్ల చ‌ట్టాన్ని కేంద్రం తీసుకు వ‌స్తుంద‌న్నారు.

2016లో కేంద్ర ప్ర‌భుత్వం ప్ర‌వేశ పెట్టిన మోడ‌ల్ ప్రిజ‌న్ మాన్యువ‌ల్ ను వెంట‌నే ఆమోదించాల‌ని అమిత్ షా అన్ని రాష్ట్ర ప్ర‌భుత్వాల‌ను కోరారు. దేశంలోని రాష్ట్రాల‌లో బిట్రీష్ వారు నిర్మించిన జైళ్లు అలాగే ఉన్నాయ‌ని చెప్పారు.

ఆనాటి కాలం చెల్లిన చ‌ట్టాన్ని స‌మ‌రిస్తామ‌న్నారు. రానున్న ఆరు నెల‌ల్లో మోడ‌ల్ జైళ్ల చ‌ట్టాన్ని త‌సుకు రానుంద‌ని స్ప‌ష్టం చేశారు. దీని కోసం ప్ర‌భుత్వాల‌తో ఎప్ప‌టిక‌ప్పుడు చ‌ర్చ‌ల‌కు జ‌రుపుతున్నామ‌ని తెలిపారు అమిత్ చంద్ర షా(Amit Shah).

జైళ్ల‌కు సంబంధించి మ‌న అభిప్రాయాల‌ను పునః స‌మీక్షించు కోవాల్సిన అవ‌స‌రం ఉంద‌న్నారు. జైళ్ల సంస్క‌ర‌ణ‌ల‌కు స‌హ‌కారం అందొంచాల‌ని స్ప‌ష్టం చేశారు.

ఇప్ప‌టి వ‌ర‌కు 11 రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలు మాత్ర‌మే మాన్యువ‌ల్ ను ఆమోదించాయ‌ని వెల్ల‌డించారు. 6వ ఆల్ ఇండియా ప్రిజ‌న్ డ్యూటీ మీట్ ను ప్రారంభించి ప్ర‌సంగించారు.

జైలు మాన్యువ‌ల్ త‌ర్వాత మోడ‌ల్ జైళ్ల చ‌ట్టం తీసుకు రాబోతున్న‌ట్తు పేర్కొన్నారు. ఇప్ప‌టికే సంప్ర‌దింపులు జ‌రిపామ‌న్నారు. దేశంలోని జైళ్ల‌ను అత్యాధునికంగా తీర్చిదిద్దేందుకు మోడ‌ల్ జైళ్ల చ‌ట్టం తీసుకు వ‌స్తామ‌ని చెప్పారు.

జైళ్ల‌లో ర‌ద్దీ స‌మ‌స్య‌ను ప‌రిష్క‌రించాల్సిన అవ‌స‌రాన్ని నొక్కి చెప్పారు. వీటిని ప‌రిష్క‌రించ లేకుండా జైలు ప‌రిపాల‌న‌ను మెరుగు ప‌ర్చ‌లేమ‌న్నారు. ప్ర‌తి జిల్లా జైలులో కోర్టుతో వీడియో కాన్ఫ‌రెన్స్ సౌక‌ర్యాల‌ను క‌ల్పించాల‌ని రాష్ట్రాల‌ను అభ్య‌ర్థించారు.

Also Read : పిల్ల‌ల ఆహారాన్ని బుక్కేశారు

Leave A Reply

Your Email Id will not be published!