Ashwini Vaishnav : 200 రైల్వే స్టేషన్లలో ఆధునిక వసతులు
రైల్వే శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ వెల్లడి
Ashwini Vaishnav : కేంద్ర రైల్వే శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ కీలక ప్రకటన చేశారు. దేశంలోని 200 రైల్వే స్టేషన్ లలో ఆధునిక వసతి సౌకర్యాలను కల్పించేందుకు చర్యలు తీసుకుంటామన్నారు అశ్విని వైష్ణవ్(Ashwini Vaishnav).
ప్రపంచ స్థాయికి ధీటుగా ఉండేలా తీర్చి దిద్దుతామని స్పష్టం చేశారు. సోమవారం ఆయన మీడియాతో మాట్లాడారు. ఆయా రైల్వే స్టేషన్ లలో వెయిటింగ్ లాంజ్ లు , ఫుడ్ కోర్డులతో సహా ప్రపంచ స్థాయి సౌకర్యాలు కలిగి ఉండేలా ఏర్పాటు చేస్తామన్నారు.
ఓవర్ హెడ్ స్పేస్ లు కూడా రూపొందేలా చేస్తామన్నారు అశ్విని వైష్ణవ్(Ashwini Vaishnav). ఈ మేరకు రైల్వే శాఖ మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో ఆయా రైల్వే స్టేషన్ ను పునరుద్దరించేందుకు ప్రభుత్వం మాస్టర్ ప్లాన్ సిద్దం చేసిందన్నారు.
మహారాష్ట్ర లోని ఔరంగాబాద్ రైల్వే స్టేషన్ లో రైల్వే కోచ్ మెయింటెనెన్స్ ఫ్యాక్టరీకి శంకుస్థాపన చేశారు. దీనిని ప్రారంభించిన అనంతరం అశ్విని వైష్ణవ్ మాట్లాడారు.
47 రైల్వే స్టేషన్లకు టెండర్ల ప్రక్రియ పూర్తయిందని, 32 స్టేషన్లలో ఫిజికల్ వర్క్ ప్రారంభమైందని చెప్పారు కేంద్ర మంత్రి. ఇప్పటికే ప్లాన్ కంప్లీట్ కావచ్చిందన్నారు.
మాస్టర్ ప్లాన్ కూడా పూర్తయ్యే దశలో ఉందన్నారు. పిల్లలకు వినోద సౌకర్యాలతో పాటు వెయిటింగ్ లాంజ్ లు , ఫుడ్ కోర్ట్ లతో సాహా ప్రపంచ స్థాయి సౌకర్యాలను కలిగి ఉన్న స్టేషన్ లలో ఓవర్ హెడ్ ఖాళీలు కూడా ఏర్ఆటు అవుతాయయని తెలిపారు.
ఇదిలా ఉండగా ప్రాంతీయ ఉత్పత్తుల విక్రయానికి రైల్వే స్టేషన్లు ప్లాట్ ఫాం గా పని చేస్తాయని అశ్విని వైష్ణవ్ చెప్పారు.
Also Read : షిండేను బెదిరించిన వ్యక్తి అరెస్ట్