JP Nadda : రాజకీయ సంస్కృతిని మార్చిన మోదీ
స్పష్టం చేసిన బీజేపీ చీఫ్ జేపీ నడ్డా
JP Nadda : భారతీయ జనతా పార్టీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు దేశ ప్రధాన మంత్రి నరేంద్ర మోదీపై. ఈ దేశంలో రాజకీయ సంస్కృతిని సమూలంగా మార్చి వేసిన ఘనత మోదీకి మాత్రమే దక్కుతుందన్నారు. 2014లో ప్రధానిగా బాధ్యతలు చేపట్టాక కీలక మార్పులు చోటు చేసుకున్నాయి.
అప్పటి దాకా కేవలం ఒక కుటుంబానికి సంబంధించిన పేరు మాత్రమే వినపడేది. కానీ మోదీ వచ్చాక పూర్తిగా మారి పోయిందని పేర్కొన్నారు. ఇవాళ ప్రపంచ వ్యాప్తంగా భారత్ అంటే మోదీ అని మోదీ అంటే సంస్కృతికి నిదర్శనమని మారి పోయిందని కితాబు ఇచ్చారు జేపీ నడ్డా(JP Nadda). ఇది పార్టీ మార్పు మాత్రమే కాదు..ఇది రాజకీయ సంస్కృతికి సంబంధించిన సమూలమైన మార్పుగా పేర్కొన్నారు.
ఇది పూర్తిగా దేశాన్నే మార్చేసిందన్నారు బీజేపీ చీఫ్ . కర్ణాటక రాష్ట్రంలో ఎన్నికల ప్రచారంలో భాగంగా శుక్రవారం దావణగెరె లో జరిగిన బీజేపీ ర్యాలీని ఉద్దేశించి ప్రసంగించారు జేపీ నడ్డా. కాంగ్రెస్ పార్టీ విభజించి పాలించే రాజకీయాలకు పాల్పడుతోందంటూ ఆరోపించారు. అవినీతి, కమీషన్ , కులతత్వానికి ప్రాతినిధ్యం వహిస్తోందని ధ్వజమెత్తారు.
భారతీయ జనతా పార్టీ లక్ష్యం సమాజ సేవ, అభివృద్ది కోసం పాటు పడుతోందని చెప్పారు. ఇవాళ బీజేపీ ఒక్కటే కుటుంబ, వంశ పారంపర్య పాలనకు దూరంగా ఉందన్నారు జేపీ నడ్డా(JP Nadda). ఇందులో ఎలాంటి అనుమానం లేదన్నారు. ఓటు బ్యాంకు రాజకీయాలకు పాల్పడుతున్నాయంటూ ప్రతిపక్షాలను ఏకి పారేశారు బీజేపీ చీఫ్.
యావత్ ప్రపంచం ప్రస్తుతం భారత్ వైపు చూస్తోందని చెప్పారు. రాబోయే ఎన్నికల్లో మరోసారి కాషాయ జెండా ఎగుర వేయాలని పిలుపునిచ్చారు జేపీ నడ్డా.
Also Read : మేయర్ ఎన్నిక వాయిదా చట్ట విరుద్దం