Rakesh Tikait : రైతుల జీవితాలతో కేంద్రం దాగుడుమూతలు ఆడుతోందంటూ నిప్పులు చెరిగారు భారతీయ కిసాన్ యూనియన్ అగ్ర నేత రాకేశ్ తికాయత్(Rakesh Tikait). తెలంగాణ సీఎం కేసీఆర్ తో ములాఖత్ అయ్యారు.
అనంతరం సుబ్రమణ్యస్వామితో కలిసి లంచ్ చేశారు. ఆ తర్వాత కీలక అంశాలపై చర్చలు జరిపారు. ప్రధానంగా రైతులను ఆదుకోవాల్సిన బాధ్యత కేంద్రంపై ఉందన్నారు.
ఇదే సమయంలో కేసీఆర్ సైతం ప్రస్తుతం భారతీయ జనతా పార్టీకి వ్యతిరేకంగా పోరాటం సాగిస్తున్నారు. ఇందులో భాగంగా భావ సారూప్యత కలిగిన నాయకులు, పార్టీలు, సీఎంలను కలుస్తున్నారు.
కేసీఆర్, రాకేశ్ తికాయత్ మధ్య జరిగిన చర్చల్లో ప్రధానంగా సాగు చట్టాలను రద్దు చేయాలని జరిగిన పోరాటంలో చని పోయిన కుటుంబాలకు సంబంధించి ఈరోజు వరకు పరిహారం ఇవ్వలేదన్నారు.
ఇదిలా ఉండగా చని పోయిన రైతులను ఆదుకునేందుకు సీఎం కేసీఆర్ ముందుకు వచ్చారు. ప్రతి కుటుంబానికి రూ. 3 లక్షల చొప్పున ఇచ్చేందుకు తాము సిద్దంగా ఉన్నామని స్పష్టం చేశారు.
ఈ మేరకు రైతు నాయకుడు రాకేశ్ తికాయత్ (Rakesh Tikait)కు ఇదే విషయాన్ని వెల్లడించారు. ఎంత మంది అధికారికంగా చని పోయారో వారి వివరాలు తమకు అందజేస్తే పూర్తి సహాయాన్ని తామే స్వయంగా అందజేస్తామని ఈ సందర్భంగా ప్రకటించారు సీఎం కేసీఆర్.
తెలంగాణ ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయానికి కృతజ్ఞతలు తెలిపారు రాకేశ్ తికాయత్. పనిలో పనిగా మోదీ సర్కార్ పై నిప్పులు చెరిగారు. ఈరోజు వరకు నమోదు చేసిన కేసులు మాఫీ చేయలేదన్నారు.
Also Read : ఎన్ని కష్టాలైనా సరే తీసుకొస్తాం