Modi Govt Praise : వ్యవసాయ రంగంలో తెలంగాణ భేష్
మెచ్చుకున్న మోదీ ప్రభుత్వం
Modi Govt Praise : సీఎం కేసీఆర్(KCR) సారథ్యంలోని తెలంగాణ ప్రభుత్వానికి ఖుష్ కబర్ చెప్పింది కేంద్ర ప్రభుత్వం. ఈ మేరకు ప్రత్యేకించి వ్యవసాయ రంగంలో రాష్ట్రం సాధించిన ప్రగతి అద్భుతం అంటూ కితాబు ఇచ్చింది. ముఖ్యంగా సాగు రంగానికి ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ (ఐటీ)ని అనుసంధానం చేసిన తీరు ప్రశంసనీయమని పేర్కొంది కేంద్రం. ఖరీఫ్ సీజన్ రానుండడంతో హైదరాబాద్ లో కేంద్ర వ్యవసాయ శాఖ జాయింట్ సెక్రటరీ డాక్టర్ యోగితా రాణా తెలంగాణ వ్యవసాయ శాఖ ఉన్నతాధికారులతో సమావేశం నిర్వహించారు. పర్ డ్రాప్ మోర్ క్రాప్ పథకాన్ని అమలు చేయడంలో కీలక పాత్ర పోషించిందన్నారు యోగితా రాణా.
సాగు రంగంలో సైతం తెలంగాణ రాష్ట్రం కీలకంగా మారిందని ప్రశంసలతో ముంచెత్తారు. 2014-15 లో 129.04 లక్షల ఎకరాలు ఉన్న సాగు విస్తీర్ణం 2022-23 సంవత్సరం నాటికి ఏకంగా భారీ ఎత్తున పెరిగిందని పేర్కొన్నారు. ఉన్నట్టుండి 232.58 లక్షల ఎకరాలకు సాగు పెరడం దీనికి నిదర్శనమన్నారు. ఈ విషయం కేంద్రం సమర్పించిన నివేదికలో స్పష్టం చేసింది. వరి సాగు విస్తీర్ణంలో 2014లో 22.74 లక్షల ఎకరాలు ఉండగా 2022లో మూడంతలు పెరిగిందని తెలిపారు యోగితా రాణా. 64.00 లక్షల ఎకరాలకు పెరిగిందని వెల్లడించారు.
ఇదిలా ఉండగా తెలంగాణలో విత్తనాలు, ఎరువుల నిల్వలు తగినంత మేర ఉన్నాయని, 950కి పైగా ఆరోగ్య రైతు సేవా కేంద్రాలు పని చేస్తున్నాయని చెప్పారు. మొత్తంగా బీఆర్ఎస్ సర్కార్ కు ఇది మరింత ఊపునిచ్చేలా చేసింది.
Also Read : PM Modi Honoured : మోదీకి ఫ్రాన్స్ అత్యున్నత పురస్కారం