AIIMS Bilaspur Modi : ఎయిమ్స్ బిలాస్‌పూర్‌ను ప్రారంభించిన మోదీ

రూ. 1,470 కోట్ల వ్య‌యంతో ఎయిమ్స్ నిర్మాణం

AIIMS Bilaspur Modi  : హిమాచ‌ల్ ప్ర‌దేశ్ లోని బిలాస్ పూర్ లో ఆల్ ఇండియా ఇనిస్టిట్యూట్ ఆఫ్ మెడిక‌ల్ టెక్నాల‌జీ (ఎయిమ్స్ ) ని ద‌స‌రా పండుగ రోజు బుధ‌వారం ప్రారంభించారు దేశ ప్ర‌ధాన‌మంత్రి న‌రేంద్ర మోదీ. రూ. 1,470 కోట్ల ఖ‌ర్చుతో దీనిని నిర్మించారు. ఈ ఆస్ప‌త్రిని 247 ఎక‌రాల్లో నిర్మించారు.

ఇందులో అత్య‌వ‌స‌ర‌, డ‌యాల‌సిస్ సౌక‌ర్యాలు, ఆధునిక రోగ నిర్ధార‌ణ యంత్రాల‌తో విస్త‌రించి ఉంది. 2017లో ప్ర‌ధాన మంత్రి మోదీ త‌న మొద‌టి ప‌ద‌వీ కాలంలో శంకుస్థాప‌న చేశారు ఎయిమ్స్ నిర్మాణానికి(AIIMS Bilaspur) . 18 స్పెషాలిటీతో పాటు 17 సూప‌ర్ స్పెషాలిటీ విభాగాలు ఉన్నాయి.

రూ. 1,690 కోట్ల విలువైన జాతీయ ర‌హ‌దారి ప్రాజెక్ట్ , న‌లాగ‌ఢ్ లో మెడిక‌ల్ డివైస్ పార్క్ , అలాగే బండ్ల‌లో ప్ర‌భుత్వ హైడ్రో ఇంజ‌నీరింగ్ క‌ళాశాల‌ను ప్రారంభిస్తారు. కులు ద‌స‌రా వేడుక‌ల్లో పాల్గొన్నారు ప్ర‌ధాన మంత్రి. ఎయిమ్స్ ను ప్ర‌ధాన మంత్రి(PM Modi) స్వాస్థ్య సుర‌క్ష యోజ‌న (పీఎంఎస్ఎస్ వై) కింద దీనిని ఏర్పాటు చేశారు.

ఇది 750 ప‌డ‌క‌ల సామ‌ర్థ్యం క‌లిగి ఉంది. వీటిలో 64 ఇంటెన్సివ్ కేర్ యూనిట్ (ఐసీసీ) ప‌డ‌క‌లు ఉన్నాయి. అన్ని ఆరోగ్య సేవ‌ల‌ను 24 గంట‌ల పాటు అందుబాటులో ఉంచ‌నున్నారు. ఆధునిక రోగ నిర్ధార‌ణ యంత్రాలు కూడా ఉన్నాయి. 30 ప‌డ‌క‌ల ఆయుష్ బ్లాక్ మౌలిక స‌దుపాయాల‌లో ఒక భాగం.

ఇందులో ఆయుర్వేదం, యోగా, ప్ర‌కృతి వైద్యం, యునాని, సిద్ద‌, హోమియోప‌తి వైద్య విధానం ఉన్నాయి. హెల్త్ ఇన్ ఫ్రాస్ట్ర‌క్చ‌ర్ ను ప్రోత్స‌హించ‌డంలో , హిమాచ‌ల్ ప్ర‌దేశ్ లోని గిరిజ‌న ప్రాంతాల‌కు చేరుకునేందుకు హాస్పిట‌ల్ డిజిట‌ల్ హెల్త్ సెంట‌ర్ ను కూడా ఏర్పాఉట చేసింది. బిలాస్ పూర్ లో ప్ర‌తి ఏటా 100 మంది విద్యార్థుల‌కు ఎంబీబీఎస్ సీట్లు ద‌క్కున్నాయి.

Also Read : రాహుల్ గాంధీ చెప్పినందుకే బ‌రిలో ఉన్నా

Leave A Reply

Your Email Id will not be published!