Priyanka Gandhi : కాంగ్రెస్ పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి ప్రియాంక గాంధీ సంచలన కామెంట్స్ చేశారు. ఆమె దేశ ప్రధాన మంత్రి నరేంద్ర మోదీపై తీవ్రంగా మండిపడ్డారు. ప్రధానంగా తమ పార్టీని టార్గెట్ చేయడాన్ని తప్పు పట్టారు.
పాలించడం చేత కాక, ప్రజలకు ఇచ్చిన హామీలను నెరవేర్చడంలో ఘోరంగా వైఫల్యం చెందాడని అన్నారు. తాను చేసిన తప్పుల్ని కప్పిపుచ్చుకునేందుకే తమపై ఆరోపణలు చేయడం మొదలు పెట్టారని ఎద్దేవా చేశారు.
ఈ దేశంలో ఉన్న ప్రభుత్వ సంస్థలను నిర్వీర్యం చేయడం, అమ్మకానికి పెట్టడం, తనకు చెందిన వారికి అప్పగించేందుకు ప్రయత్నిస్తున్నాడంటూ ప్రియాంకా గాంధీ(Priyanka Gandhi )ఆరోపించారు.
ప్రస్తుతం ప్రజా వ్యతిరేకత దేశ వ్యాప్తంగా కొనసాగుతోందని దానిని కప్పి పుచ్చేందుకే మోదీ ఈ ఎత్తుగడ వేశారంటూ మండిపడ్డారు.
ఎన్నికల్లో గెలిచే పరిస్థితి లేదని, మళ్లీ తమను తిట్టి పోసుకుంటే తప్పా ఆయనకు పూట గడవడం లేదంటూ సీరియస్ కామెంట్స్ చేశారు.
యూపీలో పెద్ద సంఖ్యలో ప్రభుత్వ ఉద్యోగాలు ఖాళీగా ఉన్నా ఎందుకు భర్తీ చేయడంల ఏదని నిలదీశారు. ప్రస్తుతం ప్రియాంక గాంధీPriyanka Gandhi )యూపీ ఇన్ చార్జ్ గా ఉన్నారు.
ఎలాగైనా సరే మరింత పట్టు ఉండాలని యత్నిస్తున్నారు. ప్రస్తుతం విస్తృతంగా పర్యటిస్తున్నారు. ఇప్పటి వరకు యూపీలో మూడు విడతల పోలింగ్ ముగిసింది.
ఇంకా నాలుగు విడతలు జరగాల్సి ఉంది. 403 నియోజకవర్గాలు ఉన్నాయి యూపీలో. ప్రస్తుతం బీజేపీ వర్సెస్ ఎస్పీగా మారింది.
ప్రజా సమస్యలను గాలికి వదిలేసిన బీజేపీకి ప్రజలు తగిన రీతిలో బుద్ది చెప్పడం ఖాయమన్నారు.
Also Read : సీబీఐ వద్దకు రిషి అగర్వాల్