Mallikarjun Kharge : ఆస్తుల‌ను అమ్మ‌డంలో మోదీ నెంబ‌ర్ వ‌న్

సంచ‌ల‌న కామెంట్స్ చేసిన కాంగ్రెస్ చీఫ్ ఖ‌ర్గే

Mallikarjun Kharge : కాంగ్రెస్ పార్టీ జాతీయ అధ్య‌క్షుడు మ‌ల్లికార్జున్ ఖర్గే(Mallikarjun Kharge)  సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశారు. ఆయ‌న ప్ర‌ధాన మంత్రి న‌రేంద్ర మోదీని టార్గెట్ చేశారు. ప్ర‌భుత్వ ఆస్తుల‌ను కాపాడాల్సిన మోదీ వాటిని అమ్ముకుంటూ పోతున్నారంటూ ధ్వ‌జ‌మెత్తారు. ఇలాంటి వ్య‌క్తుల వ‌ల్ల దేశం ఎలా బాగు ప‌డుతుంద‌ని ప్ర‌శ్నించారు. 75 ఏళ్లలో ఇలాంటి పీఎంను తాను చూడ‌లేద‌న్నారు.

జాతీయ వాదం , భార‌తీయం పేరుతో ప‌వ‌ర్ లోకి వ‌చ్చిన బీజేపీ స‌ర్కార్ ఇవాళ అన్ని వ‌ర్గాల ప్ర‌జ‌ల ఆశ‌ల‌పై నీళ్లు చ‌ల్లింద‌న్నారు ఖ‌ర్గే. మంగ‌ళ‌వారం హైద‌రాబాద్ కు చేరుకున్న ఆయ‌న రాహుల్ గాంధీ భార‌త్ జోడో యాత్ర‌లో పాల్గొన్నారు.

అనంత‌రం నెక్ల‌స్ రోడ్ లో జ‌రిగిన బ‌హిరంగ స‌భ‌లో పాల్గొని ప్ర‌సంగించారు. వ‌చ్చే 2024లో జ‌రిగే సార్వ‌త్రిక ఎన్నిక‌ల్లో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావ‌డం ఖాయ‌మ‌ని జోష్యం చెప్పారు ఏఐసీసీ చీఫ్‌.

మేడం సోనియా గాంధీ ఒప్పు కోవ‌డం వ‌ల్ల‌నే తెలంగాణ రాష్ట్రం ఏర్ప‌డింద‌న్నారు మ‌ల్లికార్జున్ ఖ‌ర్గే(Mallikarjun Kharge) . బీఆర్ఎస్ పేరుతో ప‌లు రాష్ట్రాల‌లో ప‌ర్య‌టిస్తున్న కేసీఆర్ ముందు రాష్ట్రాన్ని, ప్ర‌జ‌ల‌ను ఎలా మోసం చేస్తున్నారో ప్ర‌జ‌లు తెలుసు కోవాల‌ని హెచ్చ‌రించారు. కేంద్ర స‌ర్కార్ తీసుకు వ‌చ్చిన ప‌లు బిల్లుల‌ను తాము వ్య‌తిరేకిస్తే టీఆర్ఎస్ నిస్సిగ్గుగా మ‌ద్ద‌తు ఇచ్చిందంటూ ధ్వ‌జ‌మెత్తారు.

పైకి కొట్లాడుకుంటున్న‌ట్లు న‌టిస్తున్నార‌ని కానీ బీజేపీ, టీఆర్ఎస్ రెండూ ఒక‌టేన‌ని మండిప‌డ్డారు. మోదీ నెంబ‌ర్ వ‌న్ , నెంబ‌ర్ టు కేసీఆర్ అని సంచ‌ల‌న ఆరోప‌ణ‌లు చేశారు. ఇప్ప‌టి వ‌ర‌కు కేవ‌లం టాటా, అంబానీ, అదానీల‌కు మాత్ర‌మే ప్ర‌ధాన‌మంత్రి ప‌ని చేశార‌ని ఇక 135 కోట్ల ప్ర‌జ‌ల బాధ‌లు ప‌ట్టించుకున్న పాపాన పోలేద‌ని ఎద్దేవా చేశారు.

Also Read : ఓటు ఆయుధం మ‌న‌దే విజ‌యం

Leave A Reply

Your Email Id will not be published!