Modi Murmu Rahul Greetings : కొత్త ఏడాది బాగుండాలి

దేశ ప్ర‌జ‌ల‌కు ముర్ము..రాహుల్..మోదీ

Modi Murmu Rahul Greetings : గ‌తాన్ని స్మ‌రించుకుంటూ కొత్త సంవ‌త్స‌రానికి స్వాగ‌తం ప‌లుకుదాం. ఈ ఏడాదిలో దేశంలోని ప్ర‌జ‌లంతా సంతోషంగా, ఆయురారోగ్యాల‌తో ఉండాల‌ని దేశానికి చెందిన ప్ర‌ముఖులు పిలుపునిచ్చారు. ఈ సంద‌ర్భంగా భార‌త దేశ రాష్ట్ర‌ప‌తి ద్రౌప‌ది ముర్ము, ప్ర‌ధాన‌మంత్రి న‌రేంద్ర దామోద‌ర దాస్ మోదీ, ఏఐసీసీ చీఫ్ మ‌ల్లికార్జున్ ఖ‌ర్గే, సోనియా గాంధీ, రాహుల్ గాంధీ, కేంద్ర మంత్రులు అమిత్ చంద్ర షా, రాజ్ నాథ్ సింగ్ ట్విట్ట‌ర్ వేదిక‌గా శుభాకాంక్ష‌లు తెలిపారు.

నూత‌న ఏడాదిలో సంతోషంగా ఉండాల‌ని కోరారు. సోష‌ల్ మీడియా వేదిక‌గా ప్ర‌ముఖులు ట్వీట్ల‌తో, సందేశాల‌తో హోరెత్తించారు. దేశ ప్ర‌జ‌లంద‌రితో పాటు విదేశాల‌లో నివ‌సిస్తున్న ప్ర‌వాస భార‌తీయులంద‌రికీ నూత‌న సంవ‌త్స‌ర శుభాకాంక్ష‌లు(Modi Murmu Rahul Greetings)తెలిపారు. ఈ కొత్త ఏడాది 2023లో అంద‌రి జీవితాల్లో కొత్త స్పూర్తిని క‌లిగించాల‌ని, నిర్దేశించుకున్న ల‌క్ష్యాలు చేరుకోవాల‌ని, విజ‌యాలు అందుకోవాల‌ని కోరారు. ఐక్య‌త‌, స‌మ‌గ్ర‌త‌, స‌మ్మిళిత అభివృద్దికి మ‌నంద‌రం అంకితం కావాల‌ని పిలుపునిచ్చారు రాష్ట్ర‌ప‌తి ద్రౌప‌ది ముర్ము.

కొత్త సంవ‌త్సంలో అంద‌రికీ అద్భుతంగా ఉండాల‌ని , ఆశ‌లు, ఆనందం, విజ‌యాల‌తో కొత్త ఏడాది నిండి పోవాల‌ని కోరారు ప్ర‌ధాన‌మంత్రి న‌రేంద్ర దామోదర దాస్ మోదీ. ఇక దేశానికి ద్వేషం కాదు కావాల్సింది ప్రేమ కావాలంటూ దేశ వ్యాప్తంగా భార‌త్ జోడో యాత్ర చేప‌ట్టిన కాంగ్రెస్ అగ్ర నాయ‌కుడు రాహుల్ గాంధీ వెరైటీగా స్పందించారు. ఈ ఏడాదిలో దేశంలోని ప్ర‌తి వీధి, ప్ర‌తి ఊరు, ప్ర‌తి ప‌ట్ట‌ణం ప్రేమ‌తో నిండి పోవాల‌ని కోరుకుంటున్నాన‌ని పేర్కొన్నారు. ఆయ‌న చేసిన ట్వీట్ వైర‌ల్ గా మారింది.

Also Read : ఇది మ‌న సంస్కృతి కాదు – ప్ర‌గ్యా

Leave A Reply

Your Email Id will not be published!