KTR Modi : ప్రధాన మంత్రి కాదు ప్రచార మంత్రి – కేటీఆర్
నరేంద్ర మోదీపై నిప్పులు చెరిగిన మంత్రి
KTR Modi : తెలంగాణ ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్(KTR) సంచలన వ్యాఖ్యలు చేశారు. ఆయన ప్రధాన మంత్రి నరేంద్ర మోదీని టార్గెట్ చేశారు. శుక్రవారం ఆయన పీఎంపై ఆసక్తికర వ్యాఖ్యలు చేయడం కలకలం రేపింది.
సీఎం కేసీఆర్ తెలంగాణ రాష్ట్ర సమితి పార్టీని భారత రాష్ట్ర సమితిగా ప్రకటించిన అనంతరం కేంద్ర ప్రభుత్వాన్ని, ప్రధాని మోదీపై మరింత ఆరోపణలు పెంచారు. మోదీ ప్రధాన మంత్రి కానే కాదని ఆయన ప్రచార మంత్రి అని ఎద్దేవా చేశారు. కేంద్ర దర్యాప్తు సంస్థలను జేబు సంస్థలుగా ఉపయోగించుకుంటూ భయభ్రాంతులకు గురి చేయడం మాను కోవాలని మండిపడ్డారు.
తాము ఎవరికీ భయపడబోమన్నారు కేటీఆర్. తమను బెదిరిస్తే తాము ఎప్పటికీ వెనుదిరిగి చూడబోమన్నారు మంత్రి. ప్రధానిగా పూర్తిగా అసమర్థుడు మోదీ(PM Modi). అత్యంత పనికిమాలిన పీఎం. ఆయన చెప్పేది వినాలని అనుకుంటారు. కానీ ప్రజల నుంచి ఎలాంటి వినతులు విన్న దాఖలాలు ఇప్పటి వరకు లేదన్నారు కేటీఆర్.
భారత రాష్ట్ర సమితి పరంగా తాము దేశంలో బీజేపీని ఎదుర్కొనేందుకు సిద్దంగా ఉన్నామని ప్రకటించారు. మాకు ఓపిక ఉంది. మాపై చాలా దాడులు రుగుతాయని తమకు తెలుసన్నారు. అన్నింటికి సిద్దపడే ఉన్నామని స్పష్టం చేశారు కేటీఆర్(KTR Modi) . తాము ప్రవేశ పెట్టిన పథకాలను కాపీ కొట్టిన ఘనత కేంద్రానికే దక్కుతుందన్నారు.
కులాలు, మతాలు, ప్రాంతాల పేరుతో విభేదాలు సృష్టించడంలో ఉన్నంత ధ్యాస దేశ అభివృద్దిపై పెట్ట లేదన్నారు మంత్రి. మోడీ సూచనల మేరకే ఈడీ, ఐటీ, సీబీఐ వంటి వేట కుక్కలను ఉపయోగిస్తున్నారంటూ షాకింగ్ కామెంట్స్ చేశారు.
Also Read : ఐఏఎస్ లు సమగ్ర విధానంపై ఫోకస్ పెట్టాలి