Jairam Ramesh Modi : నోట్ల రద్దుపై మోడీ క్షమాపణలు చెప్పాలి
కాంగ్రెస్ సీనియర్ నేత జై రామ్ రమేష్
Jairam Ramesh Modi : నోట్ల రద్దుపై సోమవారం కీలక తీర్పు వెలువరించింది సుప్రీంకోర్టు. ఈ సందర్భంగా ఐదుగురు న్యాయమూర్తులతో కూడిన ధర్మాసనం భిన్నాభిప్రాయం వ్యక్తం చేస్తూనే మద్దతు తెలిపింది. వీరిలో నలుగురు మోదీకి అనుకూలంగా తీర్పు చెప్పగా మరో న్యాయమూర్తి బీఆర్ నాగరత్న తీవ్రంగా అభ్యంతరం తెలిపింది.
అంతే కాదు ఆమె సంచలన కామెంట్స్ చేసింది. నోట్ల రద్దు పూర్తిగా రాజ్యాంగ విరుద్దమని స్పష్టం చేసింది. అసలు నోట్లను రద్దు చేయాల్సింది ప్రధానమంత్రి కాదని పేర్కొంది. దీని గురించి ప్రకటన చేయాల్సింది ఆర్బీఐ అని, ఇంత పెద్ద ఎత్తున నిర్ణయం తీసుకునే ముందు ప్రధాని ఎవరితోనైనా మాట్లాడారా అని ప్రశ్నించింది.
ప్రజాస్వామ్య దేశంలో ప్రతిపక్షాలకు, ప్రజలకు తెలుసుకునే హక్కు ఉంటుందని పేర్కొంది. ఇది రాచరిక వ్యవస్థ కాదని గుర్తు పెట్టుకోవాలని, పోనీ ఈ నోట్ల రద్దు వల్ల ఏమైనా పురోగతి కనిపించిందా అని ప్రశ్నించింది జస్టిస్ నాగరత్న. ఇదిలా ఉండగా ఇవాళ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు, మీడియా ఇంఛార్జ్ జైరాం రమేష్ నిప్పులు చెరిగారు.
వ్యవస్థలను నీరుగారుస్తూ ప్రభుత్వ సంస్థలను గంప గుత్తగా అమ్మకానికి పెట్టిన ఘనత మోదీకే దక్కుతుందన్నారు జై రాం రమేష్(Jairam Ramesh). ఇదే సమయంలో నోట్ల రద్దు కారణంగా అన్ని రంగాలు సర్వ నాశనమయ్యాయని పేర్కొన్నారు. ప్రధానంగా సూక్ష్మ, మధ్య తరహా పరిశ్రమలతో పాటు అసంఘటిత రంగాలు కుదేలయ్యాయని ఆవేదన వ్యక్తం చేశారు.
తీర్పుపై భిన్నాభిప్రాయం వ్యక్తమైందని ఈ విషయం తెలుసుకుంటే మంచిదని ఆయన బీజేపీ శ్రేణులకు సూచించారు.
Also Read : రాహుల్ క్షమాపణ చెబుతారా