Amit Shah : కాశీ..తమిళనాడు బంధం మోదీ బలోపేతం
ఈ క్రెడిట్ అంతా ప్రధానికే దక్కుతుంది
Amit Shah : కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ చంద్ర షా ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఈ దేశంలో రెండు భిన్నమైన , చారిత్రిక నగరాలు ఉన్నాయి. వాటిలో ఒకటి కాశీ రెండోది తమిళనాడు. ఇరు ప్రాంతాలు సాంస్కృతిక పరంగా ఎంతో ఔన్నత్యాన్ని కలిగి ఉన్నాయన్నారు షా. కాగా కాశీ, తమిళనాడు మధ్య సాంస్కృతిక సంబంధాలను ప్రధాన మంత్రి మోదీ మరింత బలోపేతం చేశారంటూ ప్రశంసలు కురిపించారు.
అయతే స్వాతంత్రం వచ్చాక దేశ సాంస్కృతిక ఐక్యతను విష పూరితం చేసేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయంటూ ఆరోపించారు అమిత్ షా. వారణాసిలో నెల రోజుల పాటు జరిగిన కాశీ – తమిళ సంగమం ముగింపు కార్యక్రమంలో కేంద్ర మంత్రి పాల్గొని ప్రసంగించారు. ప్రపంచంలో ఏ దేశానికి లేనంతటి సంస్కృతి, నాగరికత ఒక్క భారత దేశానికి మాత్రమే ఉందన్నారు అమిత్ షా(Amit Shah).
స్వేచ్ఛ లభించాక కూడా కొన్ని శక్తులు శాంతిని విచ్ఛిన్నం చేసేందుకు ప్రయత్నించాయని , ఇంకా కొనసాగిస్తున్నాయని కానీ వారి ఆటలు సాగవని హెచ్చరించారు కేంద్ర హోం శాఖ మంత్రి. ప్రస్తుతం తమ ముందు ఉన్నది ఒకే ఒక లక్ష్యమని స్పష్టం చేశారు. ఒకే భాష, ఒకే సంస్కృతి, ఒకే నాగరికత, ఒకే దేశంగా ఉండాలన్నదే తమ అభిమతమన్నారు అమిత్ షా.
ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి దేశం పట్ల ఉన్న అభిమానానికి ఇది ఓ మచ్చుతునక అన్నారు. అంతే కాదు సాంస్కృతిక సమ్మేళనంతో కూడిన కొత్త శకానికి నాంది అని అభివర్ణించారు. రాబోయే రోజుల్లో ఇలాంటి సమ్మేళనాలు కొనసాగాలని ఆకాంక్షించారు.
Also Read : భుట్టో కామెంట్స్ పై బీజేపీ నిరసన