Rahul Gandhi : రాహుల్ కు కోర్టులో చుక్కెదురు
పరువు నష్టం కేసులో స్టే ఇవ్వడం కుదరదు
Rahul Gandhi : ఏఐసీసీ మాజీ చీఫ్ రాహుల్ గాంధీకి ఊహించని రీతిలో షాక్ తగిలిగింది. శుక్రవారం మోదీ పరువు నష్టం కేసు తనపై విధించిన శిక్షకు సంబంధించి స్టే ఇచ్చేందుకు గుజరాత్ కోర్టు నిరాకరించింది. స్టే ఇవ్వడం కుదరదని తేల్చింది. దీంతో ఆయన రాబోయే 2024లో జరిగే లోక్ సభ ఎన్నికల్లో పోటీ చేసేందుకు వీలు ఉండదు.
ఇప్పటికే కోర్టు కేసుకు సంబంధించి లోక్ సభ స్పీకర్ వేటు వేశారు. ఆయన కేరళ లోని వాయనాడు లోక్ సభ నియోజకవర్గం నుంచి ఎంపీగా గెలుపొందారు. ఆయన ఎంపీ అర్హత చెల్లదని పేర్కొన్నారు. దీంతో కేవలం పార్టీ పరంగా కార్యక్రమాలలో పాల్గొంటున్నారు. తనపై వేటు వేసినా తాను జనం వాయిస్ వినిపిస్తూనే ఉంటానని ప్రకటించారు.
కాగా గుజరాత్ కోర్టు ఇచ్చిన తీర్పును సవాల్ చేస్తూ భారత దేశ సర్వోన్నత న్యాయ స్థానం సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేయనున్నారని కాంగ్రెస్ పార్టీ వెల్లడించింది. కోర్టు ఇచ్చిన తీర్పుతో ఒకింత కాంగ్రెస్ పార్టీ శ్రేణుల్లో నిరాశ వ్యక్తమైంది.
2019లో ఆర్థిక నేరస్థులంతా మోదీ వారసులంటూ సంచలన ఆరోపణలు చేశారు రాహుల్ గాంధీ(Rahul Gandhi). దీంతో బీజేపీకి చెందిన నాయకుడు ఒకరు పరువు నష్టం చెల్లించాలంటూ కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు . దీంతో కేసు విచారణకు వచ్చింది.
Also Read : Falakunuma Express Fire : ఫలక్ నుమా ఎక్స్ ప్రెస్ లో మంటలు
