Mallikarjun Kharge : మోదీజీ చరిత్రను చెరప లేరు – ఖర్గే
ఎన్సీఆర్టీ నిర్వాకంపై ఏఐసీసీ చీఫ్
Mallikarjun Kharge : ఏఐసీసీ చీఫ్ మల్లికార్జున్ ఖర్గే సంచలన కామెంట్స్ చేశారు. కేంద్ర ప్రభుత్వం పనిగట్టుకుని చరిత్రను మార్చాలని అనుకుంటోందన్నారు. బుధవారం ఆయన మీడియాతో మాట్లాడారు. తాజాగా ఎన్సీఆర్టీ 12వ తరగతి పాఠ్య పుస్తకాలలోని హిస్టరీ, పొలిటికల్ సైన్స్ కు సంబంధించి మహాత్మా గాంధీ, ఆర్ఎస్ఎస్, గాడ్సే, మొఘలుల అంశాలను తొలగించింది. ఈ విషయాన్ని అధికారికంగా వెల్లడించింది.
దీనిపై ఇప్పటికే ఎంఐఎం చీఫ్ అసదుద్దీన్ ఓవైసీ, రాజ్యసభ ఎంపీ కపిల్ సిబల్ నిప్పులు చెరిగారు. ఇక మిగిలింది ఒకే ఒక్క చరిత్ర అని అది 2014 నుంచి ఆధునిక భారత దేశ చరిత్రగా చదువు కోవాల్సి వస్తుందని ఎద్దేవా చేశారు. ఇదే సమయంలో ఓవైసీ షాకింగ్ కామెంట్స్ చేశారు. మీరు మొఘలుల చరిత్రను మార్చేస్తుంటే అక్కడ చైనా భారత్ కు చెందిన వర్తమానాన్ని చెరిపేస్తోందంటూ సీరియస్ కామెంట్స్ చేశారు.
ఇదే అంశానికి సంబంధించి మల్లికార్జున్ ఖర్గే ఇవాళ నిప్పులు చెరిగారు. పుస్తకాల్లోని సత్యాన్ని మార్చవచ్చు. కానీ దేశానికి సంబంధించిన చరిత్రను మార్చ లేరన్నారు. ఆర్ఎస్ఎస్ , బీజేపీ కూడా అలాంటిదే చేయాలని ప్రయత్నిస్తున్నాయంటూ మండిపడ్డారు మల్లికార్జున్ ఖర్గే(Mallikarjun Kharge). మోదీ సర్కార్ ఎంతగా ప్రయత్నాలు చేసినా ప్రజల హృదయాలలోంచి తొలగించలేరన్న వాస్తవాన్ని గుర్తించాలన్నారు.
Also Read : అభ్యర్థుల ఎంపికపై కాంగ్రెస్ కసరత్తు