Mallikarjun Kharge : ఆస్కార్ అవార్డుల క్రెడిట్ తీసుకోవ‌ద్దు – ఖ‌ర్గే

ప్ర‌ధాన‌మంత్రి మోదీపై ఏఐసీసీ చీఫ్ సెటైర్

Mallikarjun Kharge Oscar : ఏఐసీసీ చీఫ్ మ‌ల్లికార్జున్ ఖ‌ర్గే చేసిన కామెంట్స్ క‌ల‌క‌లం రేపాయి. పార్ల‌మెంట్ లో మంగ‌ళ‌వారం ఖ‌ర్గే చేసిన వ్యాఖ్య‌లు న‌వ్వులు పూయించారు. ప్ర‌ధాన మంత్రి న‌రేంద్ర మోదీపై సెటైర్లు విసిరారు. భార‌త దేశానికి చెందిన అత్యున్న‌త‌మైన అవార్డులుగా భావించే ఆస్కార్ అవార్డు 2023లు రెండు ద‌క్కాయి. ద‌ర్శ‌క ధీరుడు ఎస్ఎస్ రాజ‌మౌళి ద‌ర్శ‌క‌త్వం వ‌హించిన ఆర్ఆర్ఆర్ మూవీలోని నాటు నాటు సాంగ్ కు బెస్ట్ ఒరిజ‌న‌ల్ సాంగ్ కేట‌గిరీ కింద ఎంపికైంది.

అంతే కాకుండా డాక్యుమెంట‌రీ షార్ట్ ఫిలిం విభాగం కింద ది ఎలిఫెంట్ విస్పెర‌ర్స్ కు ఆస్కార్ ద‌క్కింది. ఈ సంద‌ర్బంగా రాజ్య స‌భ‌లో ఏఐసీసీ చీఫ్ మ‌ల్లికార్జున్ ఖ‌ర్గే ప్ర‌సంగించారు. ఆస్కార్ అవార్డులు గెలుచుకున్నందుకు వారిని అభినందిస్తున్న‌ట్లు తెలిపారు. ఇదే స‌మ‌యంలో ప్ర‌ధాన‌మంత్రి న‌రేంద్ర మోదీ గురించి ప్ర‌త్యేకంగా ప్ర‌స్తావించారు. ద‌య‌చేసి మోదీ ఈ ఆస్కార్ అవార్డులు వ‌చ్చిన చిత్రాల‌కు తానే ఇలా ద‌ర్శ‌క‌త్వం చేయాల‌ని చెప్పిన‌ట్లు చెప్ప‌కండి అంటూ ఎద్దేవా చేశారు.

దీంతో స‌భ‌లో ఒక్క‌సారిగా న‌వ్వులు పూశాయి. చైర్మ‌న్ గా ఉన్న ఉప రాష్ట్ర‌ప‌తి జ‌గ‌దీప్ ధ‌న్ ఖ‌ర్ కూడా కాసేపు న‌వ్వారు. వారి గెలుపును త‌న గెలుపుగా క్రెడిట్ మాత్రం తీసుకోవ‌ద్దంటూ మోదీని కోరారు మ‌ల్లికార్జున్(Mallikarjun Kharge Oscar)  కోరారు. ఏది ఏమైనా ఆస్కార్ అవార్డులు రావ‌డం అభినంద‌నీయ‌మ‌న్నారు.

ఈ రెండు ఆస్కార్ అవార్డులు దక్షిణాది నుంచి వ‌చ్చాయ‌ని ఇందుకు తాము గ‌ర్వ ప‌డుతున్నామ‌ని అన్నారు. ఈ సంద‌ర్భంగా గోయ‌ల్ చేసిన కామెంట్స్ పై ఈ ర‌కంగా సెటైర్ వేశారు ఖ‌ర్గే.

Also Read : ప్ర‌ధాని మోదీ క్ష‌మాప‌ణ చెప్పాల్సిందే

Leave A Reply

Your Email Id will not be published!