Jairam Ramesh : చిరుత‌ల పేరుతో మోదీ రాజ‌కీయం

కాంగ్రెస్ పార్టీ సంచ‌ల‌న కామెంట్స్

Jairam Ramesh : గ‌త పాల‌కులు ప‌ట్టించు కోలేద‌ని అందుకే చిరుత‌ల జాతి అంత‌రించి పోయిందంటూ కాంగ్రెస్ పార్టీపై నిప్పులు చెరిగారు, సంచ‌ల‌న ఆరోప‌ణ‌లు చేశారు ప్ర‌ధాన మంత్రి న‌రేంద్ర మోదీ.

త‌న 72వ పుట్టిన రోజు సంద‌ర్భంగా మ‌ధ్య ప్ర‌దేశ్ లోని జాతీయ పార్కులో మూడు చిరుత‌ల‌ను విడుద‌ల చేశారు. మొత్తం ఎనిమిది చిరుత‌ల‌ను న‌మీబియా నుంచి ప్ర‌త్యేక విమానాల‌తో తీసుకు వ‌చ్చారు భార‌త్ కు.

కునో నేష‌న‌ల్ పార్క్ లో వీటిని వదిలి పెట్టారు. కొన్ని నెల‌ల త‌ర్వాత సాధార‌ణ ప్ర‌జానీకం వీక్షించేందుకు అనుమ‌తి ఇస్తామ‌న్నారు

ప్ర‌ధాన మంత్రి. చిరుత‌ల పున‌రాగ‌మ‌నంపై తీవ్ర స్థాయిలో నిప్పులు చెరిగింది కాంగ్రెస్ పార్టీ. దేశంలో పెద్ద పులులు అంతరించి పోయాయంటూ అన్నీ అబద్దాలే చెప్పారంటూ ఆగ్ర‌హం వ్య‌క్తం చేసింది.

ప్ర‌తి దానిని రాజ‌కీయం చేయ‌డం బీజేపీకి, ప్ర‌ధాన మంత్రి న‌రేంద్ర మోదీకి(PM Modi) అల‌వాటుగా మారింద‌ని మండిప‌డ్డారు కాంగ్రెస్ పార్టీ ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి జై రాం ర‌మేష్‌.

ఈ సంద‌ర్భంగా ఓ లేఖ‌ను విడుద‌ల చేశారు. ప్ర‌ధాన‌మంత్రి పాథ‌లాజిక‌ల్ అబ‌ద్దాలకోరు అంటూ ఆగ్ర‌హం వ్య‌క్తం చేశారు.

2009లో చిరుత‌ల‌ను తీసుకు రావాల‌నే ప్రాజెక్టును ప్రారంభించామ‌ని ఇందుకు సంబంధించిన ఆధారంతో కూడిన లేఖ ఇదేనంటూ ఆయ‌న వెల్ల‌డించారు.

ఆనాటి స‌ర్కార్ లో ప‌ర్యావ‌ర‌ణం, అట‌వీ శాఖ‌ల‌ను నిర్వ‌హించారు జైరాం ర‌మేష్(Jairam Ramesh). 2012లో యూపీఏ ప్ర‌భుత్వం పెద్ద పులుల‌ను తిరిగి ప్ర‌వేశ పెట్టే ప్లాన్ ను సుప్రీంకోర్టు కొట్టి వేసింద‌ని తెలిపారు.

కొంత మంది ప‌రిర‌క్ష‌కులు ఇండియాలో తిరిగి ప్ర‌వేశ పెట్ట‌డాన్ని వ్య‌తిరేకించార‌ని పేర్కొన్నారు.

Also Read : గుజ‌రాత్ ఆప్ ఇన్ ఛార్జ్ గా రాఘ‌వ్ చ‌ద్దా

Leave A Reply

Your Email Id will not be published!