Rahul Gandhi : ఆ ముగ్గురి కోసమే మోదీ పాలన – రాహుల్
బీజేపీ, టీఆర్ఎస్ పార్టీలు ఒక్కటే
Rahul Gandhi : కాంగ్రెస్ అగ్ర నేత రాహుల్ గాంధీ నిప్పులు చెరిగారు మరోసారి ప్రధాన మంత్రి మోదీపై. బీజేపీ, టీఆర్ఎస్ రెండూ ఒక్కటేనని పైకి మాత్రం ప్రజల కోసం పని చేస్తున్నట్లు నాటకాలు ఆడుతున్నాయంటూ మండిపడ్డారు. ఎన్నికల సమయంలో ఇద్దరూ డ్రామాలు ఆడుతూ ఓట్లు కొల్లగొడుతూ చిల్లర రాజకీయాలకు పాల్పడుతూ ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం పాలు చేస్తున్నాయంటూ ధ్వజమెత్తారు.
రాహుల్ గాంధీ చేపట్టిన భారత్ జోడో యాత్ర హైదరాబాద్ కు చేరుకుంది. ఈ సందర్బంగా జరిగిన సభలో ఆయన ప్రసంగించారు. కేంద్రంలోని బీజేపీకి ఎంఐఎం, టీఆర్ఎస్ బి-టీమ్ లుగా పని చేస్తున్నాయంటూ సంచలన ఆరోపణలు చేశారు రాహుల్ గాంధీ(Rahul Gandhi) . మునుగోడులో ఎవరి కోసం ఉప ఎన్నిక వచ్చిందో ప్రజలు ఆలోచించు కోవాలని సూచించారు.
కరోనా సమయంలో ప్రభుత్వం తీసుకున్న అనాలోచిత నిర్ణయాల వల్ల లక్షలాది మంది నిరాశ్రయులుగా మారారని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రతి ఏటా 2 కోట్లకు పైగా ఉద్యోగాలు ఇస్తానన్న ప్రధాని మోదీ ఇప్పటి వరకు కనీసం లక్ష ఉద్యోగాలు కూడా ఇవ్వలేక పోయారంటూ ధ్వజమెత్తారు. దేశంలోని వనరులన్నీ అదానీ, అంబానీ, టాటాలకే కట్టబెడుతూ వస్తున్నారంటూ మండిపడ్డారు.
ఇక అన్నింటిని అమ్మేసుకుంటూ పోతే దేశంలో మిగిలేది మాత్రం 135 కోట్ల మంది ప్రజలు మాత్రమేనన్న సంగతి తెలుసు కోవాలన్నారు. రాష్ట్రంలో టీఆర్ఎస్ తో కానీ ఇతర పార్టీలతో కానీ కాంగ్రెస్ పార్టీ పొత్తు పెట్టుకునే ప్రసక్తి లేదన్నారు రాహుల్ గాంధీ.దేశాన్ని లూటీలు చేసిన వాళ్లకు బ్రహ్మరథం పడుతున్న ఘనత ఒక్క మోదీకే దక్కుతుందన్నారు.
Also Read : ఓటు ఆయుధం మనదే విజయం