Mohammad Azaharuddin : హైదరాబాద్ నుంచే బరిలో దిగుతా
మాజీ ఎంపీ మహ్మద్ అజహరుద్దీన్
Mohammad Azaharuddin : భారత క్రికెట్ జట్టు మాజీ కెప్టెన్ , మాజీ ఎంపీ, తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ మహమ్మద్ అజహరుద్దీన్ షాకింగ్ కామెంట్స్ చేశారు. రాబోయే అసెంబ్లీ ఎన్నికల్లో తాను హైదరాబాద్ నుంచే బరిలో ఉంటానని స్పష్టం చేశారు. తాజాగా అజహరుద్దీన్ జూబ్లీ హిల్స్ పై ఫోకస్ పెట్టారు. అక్కడ ప్రచారం చేసేందుకు వెళ్లారు.
Mohammad Azaharuddin Participating on Elections
ఆయనను అడ్డుకునే ప్రయత్నం చేశారు పార్టీకి చెందిన మాజీ దివంగత మంత్రి పి. జనార్దన్ రెడ్డి తనయుడు విష్ణు వర్దన్ రెడ్డి అనుచరులు. అజహరుద్దీన్(Mohammad Azaharuddin) వర్గీయులు విష్ణు వర్గీయుల మధ్య తోపులాట చోటు చేసుకుంది. చివరకు పోలీసులు రంగ ప్రవేశం చేయడంతో అజహరుద్దీన్ ను సురక్షితంగా బయటకు పంపించారు.
ఈ తరుణంలో పార్టీ పరంగా తనకు లైన్ క్లియర్ అయ్యిందని, తాను తప్పనిసరిగా శాసన సభ ఎన్నికల్లో పోటీ చేస్తానని స్పష్టం చేశారు. తాజాగా అజ్జూ భాయ్ చేసిన కామెంట్స్ కలకలం రేపాయి. ప్రస్తుతం పార్టీ పరంగా ఆయన కీలకమైన పదవిలో ఉన్నారు. అజహరుద్దీన్ కు హై కమాండ్ నుంచి ఆశీస్సులు ఉన్నాయి. ఆయన విషయంలో రేవంత్ రెడ్డి కానీ , మాణిక్ రావు ఠాక్రే కానీ పవర్స్ లేవు.
మొత్తంగా అజహరుద్దీన్ వ్యవహారం పార్టీకి తలనొప్పిగా మారింది. ఏం చేస్తారనే దానిపై వేచి చూడాల్సి ఉంది.
Also Read : Tirumala Rush : శ్రీవారి ఆదాయం రూ. 4.60 కోట్లు