Mohammed Azharuddin : ప్రచారంలో అజ్జూ భాయ్ దూకుడు
జూబ్లీ హిల్స్ లో రేవంత్ రెడ్డి క్యాంపెయిన్
Mohammed Azharuddin : జూబ్లీ హిల్స్ – భారత క్రికెట్ జట్టు మాజీ కెప్టెన్ , మాజీ హెచ్ సీ ఏ చీఫ్ , జూబ్లీ హిల్స్ కాంగ్రెస్ పార్టీ తరపున బరిలో నిలిచిన మహమ్మద్ అజహరుద్దీన్ విస్తృతంగా ప్రచారం చేస్తున్నారు. ఇక్కడ ఇప్పుడు పవర్ లో ఉన్న బీఆర్ఎస్ ఎమ్మెల్యే ఆర్కే పూడీ గాంధీ ఉన్నారు. అజహరుద్దీన్ కు పోటీగా ఎంఐఎం చీఫ్ అసదుద్దీన్ ఓవైసీ తమ పార్టీ తరపున అభ్యర్థిని నిలిపింది. దీంతో ఇక్కడ పోటీ మరింత తీవ్రంగా మారింది. నువ్వా నేనా అన్న రీతిలో కొనసాగనుంది.
Mohammed Azharuddin Concentration
హైదరాబాద్ నగరంలో అత్యధిక ఖరీదైన ప్రాంతం జూబ్లీ హిల్స్ . ఇక్కడ ధనవంతులు, సినీ రంగానికి చెందిన వారు ఉంటారు. అజహరుద్దీన్(Mohammed Azharuddin ) నగర వాసులకు సుపరిచితుడే. ఇదే సమయంలో విస్తృతంగా ప్రచారంలో అందరికంటే ముందున్నారు. మంత్రి కేటీఆర్ పర్యటించారు. రోడ్ షో చేపట్టారు. అజహరుద్దీన్ గొప్ప క్రికెటర్ అని కానీ లీడర్ కాడంటూ ఎద్దేవా చేశారు. దీనిపై తీవ్రంగా స్పందించారు అజ్జూ భాయ్.
తాను ఓడి పోయినా ప్రజల మధ్యనే ఉన్నానని పేర్కొన్నారు. రహ్మత్ నగర్, ఎర్రగడ్డ , జూబ్లీ హిల్స్ , తదితర ప్రాంతాలను పర్యటించానని స్పష్టం చేశారు . ఉదయం నుంచి రాత్రి పొద్దు పోయే దాకా అజహరుద్దీన్ ప్రచారంలో బిజీగా మారారు. రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడం ఖాయమని జోష్యం చెప్పారు. ఇందులో ఎలాంటి అనుమానం అక్కర్లేదన్నారు. ప్రజలు తన వైపు చూస్తున్నారని పేర్కొన్నారు.
Also Read : Rahul Gandhi : తెలంగాణపై రాహుల్ ఫోకస్