Mohammed Azharuddin : బీఆర్ఎస్ సర్కార్ బేకార్ – అజ్జూ
జూబ్లీ హిల్స్ ఎన్నికల ప్రచారం
Mohammed Azharuddin : హైదరాబాద్ – భారత క్రికెట్ జట్టు మాజీ కెప్టెన్ , ప్రస్తుత జూబ్లీ హిల్స్ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి మహమ్మద్ అజహరుద్దీన్(Mohammed Azharuddin) ఎన్నికల ప్రచారంలో దూసుకు పోతున్నారు. ప్రత్యర్థి పార్టీల కంటే ఆయన ముందంజలో ఉన్నారు. ఈ సందర్భంగా ప్రజలతో మమేకం అవుతూ రాష్ట్రంలో కొలువు తీరిన బీఆర్ఎస్ సర్కార్ పై తీవ్ర ఆరోపణలు చేశారు.
Mohammed Azharuddin Comments on BRS Party
సంక్షేమ పథకాలు మైనార్టీ ప్రజలకు అంద లేదన్నారు. కేవలం వారి అనుయాయులకు మాత్రమే ప్రయారిటీ ఇచ్చారంటూ ఆవేదన వ్యక్తం చేశారు. ప్రజలు మార్పు కోరుకుంటున్నారని, రాబోయేది కాంగ్రెస్ ప్రభుత్వమేనని స్పష్టం చేశారు. ఇందులో ఎలాంటి అనుమానం అక్కర్లేదన్నారు.
క్రికెటర్ గా సేవలు అందించానని, తాను ఇక్కడే ప్రజలతో కలిసి ఉంటానని కానీ మిగతా నేతలు ఎన్నికల సమయంలోనే ప్రజల వద్దకు వస్తారంటూ ఎద్దేవా చేశారు. తన విజయం పక్కా అని ఇంకొకరి గురించి తాను విమర్శలు చేయాలని అనుకోవడం లేదన్నారు. తమ పార్టీ ఇతర పార్టీల కంటే భిన్నంగా మేని ఫెస్టోను తయారు చేసిందన్నారు. ఆరు గ్యారెంటీ హామీలను ఇప్పటికే ఇచ్చిందని చెప్పారు.
ప్రజల తెలంగాణ కు దొరల తెలంగాణకు మధ్య జరుగుతున్న పోరాటంగా అజహరుద్దీన్ అభివర్ణించారు.
Also Read : Revanth Reddy : ఓవైసీకి రేవంత్ రెడ్డి సవాల్