Mohammed Zubair : సీతాపూర్ కేసులో బెయిల్ ఢిల్లీ కేసులో జైలు

మ‌హ్మ‌ద్ జుబైర్ కు కోర్టు ఉప‌శ‌మ‌నం

Mohammed Zubair : మ‌త‌ప‌రమైన భావాలు రెచ్చ‌గొట్టార‌నే ఆరోప‌ణ‌ల‌పై అరెస్ట్ అయిన ఆల్ట్ న్యూస్ స‌హ వ్య‌వ‌స్థాప‌కుడు మ‌హ్మ‌ద్ జుబైర్ కు సుప్రీంకోర్టు కొంత ఉప‌శ‌మ‌నం క‌లిగించింది. యూపీ కేసులో బెయిల్ వ‌చ్చింది.

కానీ ఇంకా జైలు నుంచి బ‌య‌ట‌కు రాలేదు. ముగ్గురు హిందూ మిత‌వాద నాయ‌కుల‌ను ద్వేషపూరితవాదులుగా పేర్కొన్నార‌ని కేసు న‌మోదైంది జుబైర్ పై.

ఇదిలా ఉండ‌గా యూపీ లోని సీతాపూర్ లో న‌మోదైన కేసులో నిజ నిర్దార‌ణ చేసిన కోర్టు ఈ మేర‌కు ఐదు రోజుల పాటు బెయిల్ ఇచ్చింది. కాగా ఢిల్లీలో న‌మోదైన ఇంకో కేసులో ఇంకా బెయిల్ రాక పోవ‌డంతో ఇంకా జైలులోనే ఉన్నాడు మ‌హ్మ‌ద్ జుబైర్(Mohammed Zubair).

తన ట్వీట్ తో మ‌త ప‌ర‌మైన మ‌నో భావాల‌ను దెబ్బ తీశార‌ని పేర్కొంటూ సీతాపూర్ ఎఫ్ఐఆర్ ను రద్దు చేసేందుకు యూపీ లోని అల‌హాబాద్ హైకోర్టు నిరాక‌రించింది.

దీనిని స‌వాల్ చేస్తూ ఆల్ట్ న్యూస్ కో ఫౌండ‌ర్ జుబైర్ సుప్రీంకోర్టులో పిటిష‌న్ దాఖ‌లు చేశారు. సీతాపూర్ లోని స్థానిక కోర్టు అత‌డికి బెయిల్ ఇచ్చేందుకు నిరాక‌రించింది.

పోలీసు రిమాండ్ కు పంపిన ఒక రోజు త‌ర్వాత ఇది జ‌రిగింది. ష‌ర‌తుల‌తో కూడిన బెయిల్ మంజూరు చేసింది కోర్టు. ఇందుకు సంబంధించి జుబైర్ ఎటువంటి ట్వీట్ల‌ను చేయ‌కూడ‌దంటూ ఆదేశించింది.

యూపీ స‌ర్కార్ అత‌డికి వ్య‌తిరేకంగా వాదించింది. కానీ సుప్రీంకోర్టు ఒప్పుకోలేదు. ఈ సంద‌ర్భంగా ద్వేష పూరిత వ్య‌క్తులు రాజ్యాంగంపై, న్యాయ‌మూర్తుల‌పై వ్యాఖ్య‌లు చేశారు.

నేను ఈ ర‌క‌మైన విష పూరిత‌మైన భాష‌ను బ‌య‌ట పెట్టాన‌ని కోర్టులో చెప్పారు జుబైర్(Mohammed Zubair). ఇక్క‌డ నేను రాజ్యాంగాన్ని స‌మ‌ర్థిస్తున్న‌ట్లు తెలిపాడు.

Also Read : భారీ వ‌ర్షం ముంబై అత‌లాకుత‌లం

Leave A Reply

Your Email Id will not be published!