Mohammed Zubair : జుబైర్ కు తాత్కాలిక ఉపశమనం
ఎలాంటి చర్యలు తీసుకోవద్దన్న సుప్రీంకోర్టు
Mohammed Zubair : మత భావనలు రెచ్చ గొట్టాడన్న అభియోగాల మేరకు ఫ్యాక్ట్ చెకర్ , ఆల్ట్ న్యూస్ కో ఫౌండర్ మహ్మద్ జుబైర్ ను పోలీసులు అరెస్ట్ చేశారు. ఆయనపై పలు చోట్ల కేసులు నమోదయ్యాయి.
ఆయన 2018లో చేసిన ట్వీట్ ను ఆధారంగా చేసుకుని అదుపులోకి తీసుకున్నారు. తనపై మోపిన అభియోగాలన్నీ కుట్ర పూరితమైనవని, నిరాధారమైనవని ఆరోపిస్తూ కేసులు కొట్టి వేయాలని కోరుతూ సుప్రీంకోర్టును ఆశ్రయించాడు మహ్మద్ జుబైర్(Mohammed Zubair).
ఇదే కేసుకు సంబంధించి డిల్లీ కోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. జుబైర్ చేసిన ట్వీట్ తో ఎంత మంది ఇబ్బందికి లేదా బాధకు లోనయ్యారో చెప్పాలని, దానికి సంబంధించిన వివరాలు కావాలని జడ్జి కోరారు.
అంతవరకు ఆయనకు తాత్కాలిక బెయిల్ మంజూరు చేశారు. రూ. 50,000 పూచీ కత్తుతో విడుదల చేయాలని ఆదేశించారు. ఇదిలా ఉండగా ఢిల్లీ కోర్టులో ఊరట లభించినా చివరకు యూపీలో నమోదైన కేసుల నుంచి ఇంకా ఉపశమనం కలగక పోవడంతో జుబైర్ జైలులోనే ఉన్నాడు.
తాజాగా విచారణ చేపట్టిన సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. జుబేర్(Mohammed Zubair) కు తాత్కాలిక ఉపశమనం లభించింది. బుధవారం తదుపరి విచారణ దాకా తనపై నమోదు చేసిన కేసులలో ఎటువంటి చర్యలు తీసుకోవద్దంటూ యూపీ పోలీసులను ఆదేశించింది.
ఇతర కోర్టులు ఉత్తర్వులు జారీ చేయకుండా ఆప వద్దంటూ రాష్ట్ర ప్రభుత్వం సుప్రీంకోర్టును కోరింది. దీనిపై జస్టిస్ డీవై చంద్రచూడ్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. సమస్య విష విలయంగా ఉంది.
జుబైర్ ఒక కేసులో మధ్యంతర బెయిల్ పొందాడు. కానీ మరో కేసులో అరెస్ట్ అయ్యాడు. ఇది విచిత్రంగా లేదా అని పేర్కొన్నారు. ఇదిలా ఉండగా ఈ కేసుల దర్యాప్తు కోసం యూపీ పోలీసులు ఇప్పటికే ప్రత్యేక దర్యాప్తు బృంందాన్ని ఏర్పాటు చేశారు.
Also Read : మధ్యప్రదేశ్ లో ఘోర ప్రమాదం , నదిలో పడిన బస్సు