Mohammed Zubair : మహ్మద్ జుబేర్ అరెస్ట్ వెనుక వ్యాపారవేత్త
కేసుకు సంబంధించి పోలీసుల వెల్లడి
Mohammed Zubair : 2018లో హిందూ దేవతలకు వ్యతిరేకంగా ట్వట్ చేశారని, హిందువుల మనో భావాలను దెబ్బ తీశారంటూ ఆల్ట్ న్యూస్ కో ఫౌండర్, ఫ్యాక్ట్ చకర్ మహ్మద్ జుబేర్ ను అదుపులోకి తీసుకున్నారు.
ఆయనపై పలు రాష్ట్రాలలో కేసులు కూడా నమోదయ్యాయి. చివరకు బెయిల్ కు నిరాకరించడంతో సుప్రీంకోర్టును ఆశ్రయించారు. ఈ సందర్భంగా కోర్టు కీలక వ్యాఖ్యలు చేస్తూ మధ్యంతర బెయిల్ మంజూరు చేసింది.
మహ్మద్ జుబైర్ ను జూన్ 27న అరెస్ట్ చేశారు ఢిల్లీ పోలీసులు. అతడి అరెస్ట్ పై దేశ వ్యాప్తంగా నిరసన వ్యక్తమైంది. ద్వేష పూరిత ట్వీట్ల ఆరోపణలపై 24 రోజుల పాటు కస్టడీలో ఉన్నాడు.
ఆ తర్వాత సర్వోన్నత న్యాయ స్థానం జోక్యంతో చివరకు బెయిల్ పై బయడ పడ్డాడు. ఇదిలా ఉండగా అసలు వాస్తవాన్ని పోలీసులు బట్ట బయలు చేశారు.
ఢిల్లీకి చెందిన వ్యాపారవేత్త దీని వెనుక ఉన్నారంటూ పేర్కొన్నారు. మొత్తంగా మహ్మద్ జుబేర్(Mohammed Zubair) అరెస్ట్ వెనుక ఉన్న ట్విట్టర్ యూజర్ ను గుర్తించారు.
ఢిల్లీకి చెందిన 36 ఏళ్ల రియల్ ఎస్టేట్ వ్యాపారి అని, అతను వాస్తవానికి రాజస్థాన్ లోని అజ్మీర్ కు చెందిన వాడని పోలీసులు వెల్లడించారు.
హనుమాన్ భక్త్ పేరుతో నిర్వహిస్తున్న @balajikijaiin ట్విట్టర్ హ్యాండిల్ గుర్తించారు. కాగా జుబేర్ అరెస్ట్ వెనుక వ్యాపార వేత్త ఉన్నాడని పేర్కొన్నా సదరు వ్యాపార వేత్త పేరు ను మాత్రం వెల్లడించలేక పోయారు.
కాగా ఆయనకు రాజకీయ పార్టీతో సంబంధం ఉన్నట్లు ఆధారాలు మాత్రం లేవని పేర్కొన్నారు.
Also Read : ‘న్యాప్ కిన్స్’ ఫ్రీగా ఇవ్వలేమా