Mohan Bhagwat : ముస్లిం సమాజానికి ప్రత్యేక గుర్తింపు
ఆర్ఎస్ఎస్ చీఫ్ మోహన్ భగవత్
Mohan Bhagwat : రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ చీఫ్ మోహన్ భగవత్ సంచలన వ్యాఖ్యలు చేశారు. సమాజంలో సామరస్యం కోసం ఏకపక్ష ప్రయత్నాలు ఫలించవని అన్నారు. దేశంలో దశాబ్దాలుగా ముస్లిం సమాజానికి ప్రత్యేక గుర్తింపు ఉందని చెప్పారు. మహారాష్ట్ర లోని నాగ్ పూర్ లోని హెడ్ క్వార్టర్స్ లో జరిగిన శిక్షణా శిబిరం ముగింపు సమావేశంలో ఆర్ఎస్ఎస్ చీఫ్ మోహన్ భగవత్(Mohan Bhagwat) ముఖ్య అతిథిగా పాల్గొని ప్రసంగించారు.
భారత దేశం శతాబ్దాలుగా ముస్లిం సంప్రదాయాలు , ఆరాధనా విధానాలను కాపాడుతోందని చెప్పారు. కొంత మంది నొక్కి వక్కాణిస్తున్నప్పటికీ , సమాజంలోని సభ్యుల ప్రత్యేక గుర్తింపు సురక్షితంగా ఉందన్నారు.
కొందరి అహంకారం వల్ల హిందూ ముస్లిం సంఘాలు తమ ఏకత్వాన్ని చూపకుండా అడ్డుకుంటున్నాయని ఆరోపించారు. సంభాషణ ఒక్కటే ముందుకు వెళ్లే మార్గం అయితే ప్రత్యేకతపై ఒత్తిడి చేయక పోవడం ప్రతి ఒక్కరికీ ముఖ్యమన్నారు. గుర్తింపు , జాతీయ గుర్తింపును ఏకీకరణగా అంగీకరించాని స్పష్టం చేశారు మోహన్ భగవత్.
భిన్నాభిప్రాయాలు ఉన్నప్పటికీ శతాబ్దాలుగా మనం ఒక్కటిగా ఉన్నామని, అర్థం చేసుకుంటేనే దేశంలోని సంఘాల భావోద్వేగ సమైక్యత ఏర్పడుతుందని అన్నారు ఆర్ఎస్ఎస్ చీఫ్.
దేశ విభజన జరిగిన తర్వాత ఇక్కడే ఉండి పోయిన వారంతా భారతీయులేనని అన్నారు. వారి ఆలోచనల్లో ఏమైనా తేడాలు ఉంటే వారితో మనం మాట్లాడాలని అన్నారు. భారత దేశ ఐక్యతే ప్రధానమని , ఆ దిశగా ప్రతి ఒక్కరు కృషి చేయాలని పిలుపునిచ్చారు మోహన్ భగవత్.
Also Read : Kiren Rijiju