Mohan Bhagwat : మహిళల భాగస్వామ్యం పురోగతికి మార్గం
ఆర్ఎస్ఎస్ చీఫ్ మోహన్ భగవత్ కామెంట్స్
Mohan Bhagwat : రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ దేశ అధ్యక్షుడు మోహన్ భగవత్(Mohan Bhagwat) ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. మహిళలు లేకుంటే దేశమే లేదన్నారు. విజయ దశమి పండుగను పురస్కరించుకుని మహారాష్ట్ర లోని నాగ్ పూర్ లో బుధవారం జరిగిన వేడుకల్లో ఆర్ఎస్ఎస్ చీఫ్ ప్రసంగించారు.
మహిళలు లేకుండా సమాజం పురోగమించదన్నారు. బీజేపీ సైద్ధాంతిక మాతృ సంస్థ తొలిసారిగా నిర్వహించిన వార్షిక కార్యక్రమానికి మహిళలు ముఖ్య అతిథులుగా రావడం విశేషం. మోహన్ భగవత్ చేసిన వ్యాఖ్యలు అత్యంత ప్రాధాన్యత సంతరించుకున్నాయి. దేశంలో ఎవరెస్ట్ శిఖరాన్ని రెండుసార్లు అధిరోహించిన మహిళగా చరిత్ర సృష్టించారు సంతోష్ యాదవ్.
1992లో, 1993లో అధిరోహించారు. మనం మహిళలకు సాధికారత కల్పించాలన్నారు. మహిళలు లేకుండా సమాజం పురోగమించదన్నారు ఆర్ఎస్ఎస్ చీఫ్. ఇదిలా ఉండగా 100 ఏళ్ల ఆర్ఎస్ఎస్ చరిత్రలో ఒక మహిళను అధికారిక కార్యక్రమానికి ముఖ్య అతిథిగా పిలవడం ఇదే తొలిసారి.
జనాభా విధానంపై కూడా ఫోకస్ పెట్టాలన్నారు. జనాభాకు వనరులు అవసరం. వనరులు నిర్మించకుండా జనాభా పెరిగితే భారంగా మారుతుందన్నారు. జనాభాను ఆస్తిగా పరిగణించే మరో అభిప్రాయం కూడా ఉందన్నారు. రెండు అంశాలను దృష్టిలో ఉంచుకుని అందరికీ జనాభా విధానంపై పని చేయాలన్నారు మోహన్ భగవత్(Mohan Bhagwat). హిందూ రాష్ట్ర భావనపై సర్వత్రా చర్చ జరుగుతోందన్నారు.
గతంలో ఎన్నడూ లేనంతగా భారత దేశ ప్రతిష్ట పెరిగిందన్నారు ఆర్ఎస్ఎస్ చీఫ్. ప్రపంచాన్ని భయభ్రాంతులకు గురి చేసిన కరోనా మహమ్మారిని సమర్థవంతంగా ఎదుర్కొంది. అంతే కాదు ఉచితంగా ఎన్నో దేశాలకు వ్యాక్సిన్లను పంపిణీ చేసిందన్నారు. ఆర్థిక, రాజకీయ సంక్షోభంతో కొట్టుమిట్టాడుతున్న శ్రీలంకను ఆదుకుందన్నారు మోహన్ భగవత్.
Also Read : ఆర్ఎస్ఎస్ కామెంట్స్ పై యాత్ర ఎఫెక్ట్