Mohanbabu University : అటు సినిమా రంగంలో తనకంటూ ప్రత్యేకమైన ఇమేజ్ స్వంతం చేసుకున్న అరుదైన నటుడు మంచు మోహన్ బాబు. ఆయన విద్యా పరంగా స్కూల్ ఏర్పాటు చేసి ఎందరో విద్యార్థులను తీర్చి దిద్దుతున్నారు.
తిరుపతిలో ఇప్పటికే శ్రీ విద్యా నికేతన్ ను స్థాపించారు. కుల మతాలకు అతీతంగా చదువుకునేలా ప్రోత్సహిస్తున్నారు మోహన్ బాబు. ఇదే సంస్థను హైదరాబాద్ శివారులో సైతం ఏర్పాటు చేశారు.
తాజాగా మోహన్ బాబు సంచలన ప్రకటన చేశారు. ఈ మేరకు మోహన్ బాబు యూనివర్శిటీని(Mohanbabu University) ప్రారంభిస్తున్నట్లు ప్రకటించారు. ఇదే విషయాన్ని సామాజిక మాధ్యమాల ద్వారా వెల్లడించారు మోహన్ బాబు.
ప్రతి ఒక్కరు చదువు కోవాలన్నదే నా కల. ఆనాడు ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొన్నా. అందుకే ఏ ఒక్కరు చదువుకు దూరం కాకూడదనే తాను 30 ఏళ్ల కిందట శ్రీ విద్యా నికేతన్ పేరుతో విద్యా సంస్థను ఏర్పాటు చేశా.
ఆనాడు అది చిన్న మొక్క. ఇప్పుడు మహా వృక్షమై ఎదిగింది. దాని శాఖలు నలు దిశలా విస్తరించాయి. ఇంత కాలం మీ ఆదరాభిమానాలు అందించినందుకు ధన్యవాదాలు.
మీ ప్రేమ, మీరిచ్చిన బలం తాను మరిచి పోలేనంటూ పేర్కొన్నారు మోహన్ బాబు. త్వరలో మోహన్ బాబు విశ్వ విద్యాలయం ఏర్పాటుకు సహకారం అందిస్తారని ఆశిస్తున్నట్లు తెలిపారు.
ఈ విషయాన్ని ట్విట్టర్ ద్వారా వెల్లడించారు మోహన్ బాబు మంచు. 1993లో ప్రారంభమైంది. ఆ తర్వాత విద్యా నికేతన్ ఇంటర్నేషనల్ స్కూల్ , కాలేజ్ గా మారింది.
అక్కడి నుంచి ఇంజనీరింగ్ , మెడికల్, ఫార్మసీ, పీజీ కాలేజీలను ఏర్పాటు చేశామన్నారు. ఇప్పుడు యూనివర్శిటీని ఏర్పాటు చేయబోతున్నట్లు ప్రకటించారు.
Also Read : 12 నుంచి నీట్ పీజీ కౌన్సెలింగ్ షురూ