Supreme Court : మనీలాండరింగ్ అరెస్టులు ఏకపక్షం కాదు
సంచలన వ్యాఖ్యలు చేసిన సుప్రంకోర్టు
Supreme Court : మనీలాండరింగ్ అరెస్ట్ లు ఏకపక్షం కాదంటూ సంచలన కామెంట్స్ చేసింది భారత దేశ సర్వోన్నత ప్రధాన న్యాయ స్థానం సుప్రీంకోర్టు. జస్టిస్ ఏఎం ఖాన్విల్కర్ నేతృత్వంలోని ధర్మాసనం దర్యాప్తు సంస్థల అధికారాలను మరింత విస్తృతం, బలోపేతం చేసింది.
పీఎంఎల్ఏ లోని కొన్ని రూల్స్ ని సవాల్ చేస్తూ దాఖలైన పిటిషన్లపై బుధవారం కోర్టు విచారణ చేపట్టింది. ఈ సందర్భంగా ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది. కీలక తీర్పుతో ఈడీకి మద్దతు ఇచ్చినట్లయింది.
దర్యాప్తు ప్రారంభించడం, అరెస్ట్ చేసే అధికారం, ఇతర అధికారాలతో సహా అనేక అధికారాలకు సంబంధించి ఈడీకి వ్యతిరేకంగా లేవనెత్తిన అన్ని అభ్యంతరాలను సుప్రీంకోర్టు(Supreme Court) తిరస్కరించింది.
మనీలాండరింగ్ నిరోధక చట్టం (పీఎంఎల్ఎ) లోని దాదాపు అన్ని కఠినమైన రూల్స్ ను అత్యున్నత న్యాయ స్థానం సమర్థించింది.
ఇదిలా ఉండగా అరెస్ట్ కు గల కారణాలను లేదా సాక్ష్యాలను తమకు తెలియ చేయకుండా నిందితులను అరెస్ట్ చేసే అధికారం రాజ్యాంగ విరుద్దమని పిటిషనర్లు వాదించారు.
నిందితుడి నుండి దోష పూరిత వాంగ్మూలాలను రికార్డు చేయడం, సమాచారాన్ని దాచి పెట్టినందుకు జరిమానా విధిస్తామంటూ బెదిరింపులకు పాల్పడినట్లు తెలిపారు.
ఈ వాదనలను కోర్టు తోసిపుచ్చింది. ప్రతి కేసులో ఐసీఐఆర్ (ఎన్ ఫోర్స్ మెంట్ కేస్ ఇన్ఫర్మేషన్ రిపోర్ట్ ) కాపీని సరఫరా చేయడం తప్పనిసరి కాదని, అంతర్గత పత్రం కాబట్టి అది ఎఫ్ఐఆర్ కు సమానమని తెలిపింది.
నిందితుడికి ఈ కాపీని పొందేందుకు అర్హులని పిటిషనర్ల సవాల్ ని తోసిపుచ్చింది.
Also Read : క్యాసినో వ్యవహారం ఈడీ దాడుల కలకలం