Heavy Rains Hyd : పోటెత్తిన మూసీతో పరేషాన్
జలాశయాలు నిండు కుండలు
Heavy Rains Hyd : ఎడ తెరిపి లేకుండా కురుస్తున్న వర్షాల తాకిడికి నగరం తడిసి ముద్దవుతోంది. గతంలో ఎన్నడూ లేని రీతిలో కంటిన్యూగా కురుస్తుండడంతో హైదరాబాద్(Heavy Rains Hyd) లోని ఉస్మాన్ సాగర్, హిమాయత్ సాగర్ జలాశయాలు నిండు కుండలుగా మారాయి.
ఒక్కో దానికి భారీ ఎత్తున వరద నీరు వచ్చి చేరుతోంది. మూసీ నది పొంగి ప్రవహిస్తోంది. ఇక హిమాయత్ సాగర్ పూర్తి స్థాయి నీటి మట్టం 1763.50 అడుగులు కాగా ప్రస్తుతం 1761.9 అడుగుల వద్ద ఉంది.
ఇన్ ఫ్లో 8,000 క్యూ సెక్కులు ఉండగా ఔట్ ఫ్లో 10,700 క్యూసెక్కులుగా ఉంది. దీంతో 8 గేట్లు ఎత్తేశారు. మూసీకి నీటిని దిగువ వదులుతున్నారు.
ఇక ఉస్మాన్ సాగర్ పరిస్థితి కూడా ఇలాగే కొనసాగుతోంది.
అది కూడా ప్రమాదకర స్థితికి చేరుకుంది. దీని జలాశయ నీటి మట్టం 1790 అడుగులు కాగా ప్రస్తుతం 1789.10 అడుగులుగా ఉంది. ఇన్ ఫ్లో 8,000 క్యూసెక్కులు కాగా ఔట్ ఫ్లో 8,281 క్యూసెక్కులుగా ఉంది.
మొత్తం 13 గేట్లు ఎత్తేశారు మూసీకి నీటిని వదిలారు. దీంతో మూసీ పరీవాహక ప్రాంతాల పరిధిలోని ముంపు బాధితులను సురక్షిత ప్రాంతాలకు తరలించారు.
ఇదిలా ఉండగా మూసీ నదికి(Heavy Rains Hyd) వరద ఉధృతి పోటెత్తడంతో అంబర్ పేట్ – కాచి గూడ, మూసారాంబాగ్ – మలక్ పేట్ మధ్య
రాక పోకలు పూర్తిగా నిలిచి పోయాయి.
వేరే మార్గాల ద్వారా ట్రాఫిక్ ను మళ్లించారు. మరో వైపు వాతావరణ శాఖ తాజాగా మరో హెచ్చరిక జారీ చేసింది. భారీ ఎత్తున వర్షాలు కురవనున్నాయని తెలిపింది. మరో వైపు మూసీ ప్రాజెక్టు ప్రమాద స్థాయి దాటింది.
అంతకంతకూ వదర ప్రవాహం పెరుగుతోంది. ముందస్తుగా ఎనిమిది గేట్లు తెరిచారు. ప్రాజెక్టు పూర్తి స్థాయి నీటి మట్టం 645 అడుగులు కాగా
ప్రస్తుత నీటి సామర్థ్యం 637.500 అడుగులుగా ఉంది. ఇక యాదాద్రి జిల్లా రుద్రవల్లి గ్రామ శివారులో మూసీ వరద ప్రవహిస్తోంది.
Also Read : వేటు వేసేందుకు రంగం సిద్దం