Moranchapalli Villagers : మోరంచల్లి గ్రామస్థులు సురక్షితం
సహాయక సిబ్బందికి హ్యాట్సాఫ్
Moranchapalli Villagers : బంగాళా ఖాతంలో చోటు చేసుకున్న అల్ప పీడనం వాయుగుండంగా మారింది. ఇరు తెలుగు రాష్ట్రాలను వర్షాలు వణికిస్తున్నాయి. ఎక్కడ పడితే అక్కడ ట్రాఫిక్ జామ్ ఏర్పడింది. పలు చోట్ల వాహనాలు నిలిచి పోయాయి. ఎడ తెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలకు ఆనకట్టలు, వంతెనలు తెగి పోయాయి. పలు చోట్ల గండ్లు పడ్డాయి. ఇక భద్రాచలం ప్రమాదకర స్థాయిని దాటి ప్రవహిస్తోంది. లోతట్టు ప్రాంతాలు జలమయం అయ్యాయి. బాధితులు అంతకంతకూ పెరుగుతున్నారు.
Moranchapalli Villagers Safe
మరో వైపు వరద ఉధృతి ధాటికి వరంగల్ , హన్మకొండ జిల్లాలను నీళ్లు ముంచెత్తాయి. పలు కాలనీల్లోకి నీళ్లు చేరాయి. ఈ తరుణంలో జయశంకర్ భూపాలపల్లి జిల్లా మోరంచపల్లి గ్రామస్థులు(Moranchapalli Villagers) వరదలో చిక్కుకున్నారు. ఈ విషయం తెలుసుకున్న వెంటనే తెలంగాణ సీఎం కేసీఆర్ అలర్ట్ అయ్యారు. ఈ మేరకు సమీక్ష చేపట్టారు. వర్షాలపై ఆరా తీశారు. వరద నీటిలో చిక్కుకున్న గ్రామస్థులను ఎలాగైనా సరే రక్షించాలని సీఎస్ ను ఆదేశించారు.
ఈ మేరకు హెలికాప్టర్లను ఏర్పాటు చేయాలని స్పష్టం చేశారు. దీంతో అగ్నిమాపక సిబ్బంది రంగంలోకి దిగింది. హెలికాప్టర్ ద్వారా గ్రామస్థులను రక్షించారు. 2 హెలికాప్టర్లలో వారిని తరలించారు. ఇందులో అగ్ని మాపక దళానికి చెందిన ఆరు బోట్ల ద్వారా ఒడ్డుకు చేర్చారు. గ్రామస్థులందరినీ తరలించారు. వరదల్లో చిక్కుకున్న ఆరుగురిని హెలికాప్టర్ ద్వారా రెస్క్యూ టీం ఆదుకుంది.
Also Read : SCR Cancels : భారీ వర్షాలు పలు రైళ్లు రద్దు