Rahul Gandhi : అమ్మా నిన్ను చూసి గ‌ర్విస్తున్నా – రాహుల్

సంచ‌ల‌న కామెంట్స్ చేసిన కాంగ్రెస్ నేత

Rahul Gandhi : కాంగ్రెస్ పార్టీ మాజీ చీఫ్, వాయ‌నాడు ఎంపీ రాహుల్(Rahul Gandhi)  భార‌త్ జోడో యాత్ర చేప‌ట్టారు. ఈ సంద‌ర్భంగా ఆస‌క్తిక‌ర వ్యాఖ్య‌లు చేశారు. రాహుల్ గాంధీ త‌న త‌ల్లి సోనియా గాంధీని చూసి గ‌ర్వంగా ఉంద‌ని పేర్కొన్నారు. పార్టీని క‌ష్ట స‌మ‌యంలో న‌డిపించిన తీరు గొప్ప‌ద‌న్నారు.

ఇదిలా ఉండ‌గా కాంగ్రెస్ పార్టీ కొత్త చీఫ్ గా మ‌ల్లికార్జున్ ఖ‌ర్గే ప‌ద‌వీ బాధ్య‌త‌లు చేప‌ట్టారు. ఈ సంద‌ర్భంగా తాత్కాలిక చీఫ్ గా ఉన్న సోనియా గాంధీ సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశారు. తాను ఇక ఉప‌శ‌మ‌నం పొందాన‌ని, ఒక ర‌కంగా చెప్పాలంటే బ‌రువు పూర్తిగా త‌గ్గి పోయింద‌ని అన్నారు.

ఈ త‌రుణంలో త‌న త‌ల్లి గురించి అనుబంధాన్ని పంచుకున్నారు రాహుల్ గాంధీ. ఈ సంద‌ర్భంగా త‌న అమ్మ‌మ్మ‌ను గుర్తు చేసుకుంటూ సోష‌ల్ మీడియాలో భావోద్వేగంతో పోస్ట్ చేశారు. ఆమె ఇటీవ‌ల ఇట‌లీలో క‌న్ను మూశారు. త‌ల్లి, చెల్లెలు, రాహుల్గాంధీ హాజ‌ర‌య్యారు.

ఇదే స‌మ‌యంలో మాజీ ప్ర‌ధాన మంత్రి, దివంగ‌త ఇందిరా గాంధీ త‌న‌కు సోనియా గాంధీ త‌న‌కు కూతురు లాంటిద‌ని ఆనాడే ప్ర‌శంసించింద‌ని ఈ సంద‌ర్భంగా గుర్తు చేశారు రాహుల్ గాంధీ. అమ్మా డాడీ ఒక‌సారి మీరు త‌న‌కు ఎప్పుడూ లేని కుమార్తె అని నాకు చెప్పారు.

ఎంత క‌రెక్ట్ . ఆమె మీ కొడుకుగా ఉన్నందుకు నిజంగా గ‌ర్వ ప‌డుతున్నాన‌ని స్ప‌ష్టం చేశారు రాహుల్ గాంధీ. నేను మీ కొడుకు అయినందుకు చాలా గ‌ర్వంగా ఉంద‌ని మ‌రోసారి పేర్కొన్నారు.

Also Read : కేజ్రీవాల్ కామెంట్స్ పై కాంగ్రెస్ ఫైర్

Leave A Reply

Your Email Id will not be published!