Motkupalli Narasimhulu : హస్తం గూటికి మోత్కుపల్లి
ఏఐసీసీ ఆఫీసులో నర్సింహులు
Motkupalli Narasimhulu : న్యూఢిల్లీ – తెలంగాణ రాజకీయాలలో కీలకమైన మార్పులు చోటు చేసుకుంటున్నాయి. కీలకమైన నేతలు కాంగ్రెస్ పార్టీలో చేరుతుండడం ఒకింత ఆశ్చర్యాన్ని కలుగ చేస్తోంది. గతంలో తెలుగుదేశం పార్టీలో కీలకమైన నాయకుడిగా ఉన్నారు మోత్కుపల్లి నర్శింహులు. గవర్నర్ పదవి వస్తుందని అనుకున్నారు. కానీ చంద్రబాబు వల్ల రాలేదని వాపోయారు. తాజాగా మోత్కుపల్లి సంచలనంగా మారారు. బాబు అరెస్ట్ ను ఖండిస్తూ ఆందోళన చేపట్టారు.
Motkupalli Narasimhulu Sensational Decision
టీడీపీ నుంచి భారతీయ జనతా పార్టీలోకి జంప్ అయ్యారు. అక్కడ ఇముడ లేక పోయారు. ఆ పార్టీపై తీవ్ర ఆరోపణలు చేశారు. అధినాయకత్వంతో పాటు రాష్ట్ర నాయకత్వంపై కూడా సంచలన కామెంట్స్ చేశారు. బ్రాహ్మణులు, రెడ్లకే ప్రయారిటీ ఉందంటూ ఆరోపించారు.
ఆపై గులాబీ బాస్ సీఎం కేసీఆర్ ను దళిత ప్రదాత అంటూ పొగడ్తల వర్షం కురిపించారు. రైతు బంధు, దళిత బంధు పథకాలు దేశానికే ఆదర్శం అంటూ కొనియాడారు. చివరకు బీఆర్ఎస్ తీర్థం పుచ్చుకున్నారు. ఇటీవలి కాలం నుంచి మోత్కుపల్లి నర్శింహులు మౌనంగా ఉన్నారు.
ఉన్నట్టుండి మరోసారి హాట్ టాపిక్ గా మారారు. దళిత సామాజిక వర్గానికి చెందిన మోత్కుపల్లికి(Motkupalli Narasimhulu ) మంచి పట్టుంది. రాజకీయ పరంగా ఎంతో అనుభవం కలిగిన నాయకుడిగా పేరుంది. ప్రస్తుతం ఆయన ఏఐసీసీ ఆఫీసుకు చేరుకోవడం ఆసక్తిని రేపుతోంది.
Also Read : Nagam Janardhan Reddy : కాంగ్రెస్ మోసం నాగం ఆగ్రహం