Congress Chief Poll : ఎంపీల లేఖతో కాంగ్రెస్ లో కదలిక
మార్పులు చేసేందుకు అంగీకారం
Congress Chief Poll : ఐదుగురు ఎంపీలతో కూడిన లేఖ ఆల్ ఇండియా కాంగ్రెస్ పార్టీ (ఏఐసీసీ) లో తీవ్ర దుమారం రేపింది. ప్రధానంగా వచ్చే అక్టోబర్ 17న జరిగే పార్టీ అధ్యక్ష పదవికి సంబంధించి ఎన్నికలను పూర్తిగా పారదర్శకంగా ఉండేలా చూడాలని కోరారు.
పార్టీ మాజీ చీఫ్, వాయనాడు ఎంపీ రాహుల్ గాంధీ కూడా అధ్యక్ష పోటీకి(Congress Chief Poll) సంబంధించి కీలక వ్యాఖ్యలు చేశారు. తాను కూడా బరిలో ఉండనని ఎందుకని అనుకుంటున్నారంటూ ప్రశ్నించారు.
దీంతో కాంగ్రెస్ పార్టీ చీఫ్ పదవి మరింత రసవత్తరంగా మారనుంది. పోటీ పెరగనుంది. గత కొంత కాలం నుంచీ పార్టీలో గాంధీ ఫ్యామిలీ వర్సెస్ నాన్ గాంధీ ఫ్యామిలీ నేతల మధ్య పోరు కొనసాగుతోంది. జీ23 పేరుతో అసమ్మతి వర్గం కూడా ఏర్పాటైంది.
తిరువనంతపురం ఎంపీ శశి థరూర్ చేసిన కామెంట్స్ కలకలం రేపాయి. ఆయన మాతృభూమి పత్రికలో పార్టీకి సంబంధించి ఎన్నిక సజావుగా జరగాలని కోరారు.
తాను కూడా బరిలో ఉంటానని చెప్పకనే చెప్పారు. లేఖ దెబ్బకు కాంగ్రెస్ పార్టీ దిగి వచ్చింది. ఈ మేరకు కీలక ప్రకటన చేశారు ఎన్నికల ఆఫీసర్ మధుసూదన్ మిస్త్రీ. ఎన్నికకు సంబంధించి రూల్స్ కూడా డిక్లేర్ చేశారు.
కాంగ్రెస్ పార్టీ అధ్యక్ష పదవికి నామినేషన్ దాఖలు చేయాలని అనుకునే వారు ఎవరైనా సరే ఎలక్టోరల్ కాలేజీలో ఉన్న మొత్తం 9,000 మంది ప్రతినిధుల జాబితాను చూడొచ్చంటూ స్పష్టం చేశారు.
ఇదిలా ఉండగా శశి థరూర్ , కార్తీ చిదంబరం, మనీష్ తివారీలతో సహా ఐదుగురు ఎంపీలు ఎన్నికల ప్రక్రియలో పారద్శరకత ఉండాలని మిస్త్రీకి రాసిన లేఖలో పేర్కొన్నారు.
వచ్చే అక్టోబర్ 17న జరిగే ఎన్నికకు సంబంధించి సెప్టెంబర్ 24 నుంచి 30 దాకా నామినేషన్లు స్వీకరించనున్నారు.
Also Read : ఇక జార్ఖండ్ సీఎం సోదరుడి వంతు